IBomma: ఇటీవల హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ ముఠాను పట్టుకున్నారు. వారంతా కూడా సినిమాలను పైరసీ చేస్తూ వివిధ సైట్లకు అమ్ముకుంటున్నారని పోలీసులు ప్రకటించారు. i BOMMA కూడా విక్రయిస్తున్నారని ఆరోపించారు. తాము అత్యంత సాంకేతికపరమైన పరికరాలు ఉపయోగించి ఈ రాకెట్ మొత్తాన్ని చేదించామని పోలీసులు వెల్లడించారు.. త్వరలోనే i BOMMA నిర్వాహలను పట్టుకుంటామని స్పష్టం చేశారు.. సినిమాలను పైరసీ చేసేవారు వివిధ బెట్టింగ్ సైట్లను నిర్వహిస్తున్నారని.. ఇలా వచ్చిన డబ్బును అక్రమ మార్గాలలోకి మళ్లిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. పోలీసులు ఈ ప్రకటనలు చేసిన తర్వాత i BOMMA నిర్వాహకులు స్పందించారు.. కీలక ప్రెస్ నోట్ విడుదల చేశారు.
“i BOMMA మీద మీరు ఫోకస్ చేశారు. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం.. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏమి పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు..
1) హీరోలకు అంత రెమ్యూనేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా? ఎవరు అయినా?
2) సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.. వాళ్లు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్లకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి.. కానీ మీ హీరోకి, హీరోయిన్ కి వస్తాయా?
3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాలలో షూటింగ్లకు, ట్రిప్స్ కు ఖర్చు పెడుతున్నారు. మిగతా వాళ్లకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్స్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా? ఇక్కడ వాళ్లకు ఉపాధి కలుగుతుంది కదా?” అంటూ i BOMMA పేరుతో విడుదలైన ఓ ప్రెస్ నోట్లో ప్రశ్నించారు.
” 4) అనవసర బడ్జెట్ పెట్టి.. ఆ బడ్జెట్ రికవరికి దానిని మా నెత్తి మీద రుద్ది ఎక్కువకు అనుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ అండ్ థియేటర్స్ ఓనర్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు.
5) మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే నేను మీ మీద దృష్టి సారించాల్సి ఉంటుంది.
6) ఫస్ట్ వేరే కెమెరా ఫ్రెండ్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లో మీద మీ దృష్టి పెట్టండి..i BOMMA అనేది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ కు యూజర్స్ ను మళ్ళించే ప్రక్రియ. మీ యాక్షన్ కు నా రియాక్షన్ ఉంటుంది.
7) ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు అవుతుంది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నాం.
8) i BOMMA వాళ్లు ఇండియాలోనే తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్లకు కూడా షేర్ చేయడం లేదు. మేము i BOMMA.net వాళ్లంతా మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి. అది కూడా పెంట మీద వేయకండి. మేము ఏ దేశంలో ఉన్న భారతదేశంలో అందులో తెలుగు వాళ్ల కోసమే ఆలోచిస్తాము.
9) చావుకు భయపడని వాడు దేనికీ భయపడడు.. there is nothing more dangerous than a man who has nothing to lose” అని i BOMMA పేరుతో విడుదలైన ఓ లేఖ సంచలనం సృష్టిస్తోంది.
ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం i BOMMA కు వేరే వ్యక్తులు వీడియోలు ఇస్తున్నారని తెలుస్తోంది. కేవలం i BOMMA ను వారు ఒక మాధ్యమం లాగానే వాడుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ i BOMMA వెనుక ఉన్న నిర్వాహకులు రెస్పాండ్ కావడంతో పోలీసులు అత్యంత సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.