YCP Volunteers: ఏపీలో( Andhra Pradesh) వాలంటీర్ల కథ ముగిసినట్టేనా? కూటమి ప్రభుత్వం వారి నియామకం చేపట్టదా? వారిని అదనపు భారం అని భావిస్తోందా? అందుకే భర్తీ చేయడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. కానీ ఎంతవరకు వాలంటీర్ల నియామకం చేపట్టలేదు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం వాలంటీర్ల ప్రస్తావన చేయడం లేదు. దీంతో వాలంటీర్ల అంశం అనేది ముగిసిన అధ్యయంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతవరకు పోరాట బాట పట్టారు వాలంటీర్లు. కానీ తరువాత దానిని కొనసాగించలేకపోయారు. అయితే వాలంటీర్లను మరిచిపోవడం తెలుగుదేశం పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం.
* ప్రజల్లో సంతృప్తి పెంచింది వారే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత ప్రభుత్వం వారికి అప్పగించింది. దీంతో ప్రజల్లో కూడా సంతృప్తి శాతం కనిపించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత లేకపోవడంతో వారు వాలంటీర్ల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. వైసిపి నాయకత్వం తీరుపై ఆవేదన చెందారు. 2024 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయలేదు. దాంతో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. అయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈ స్థాయిలో ఓట్లు రావడానికి ప్రధాన కారణం వాలంటీర్లు. కానీ దానిని గుర్తించలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
* పేద ప్రజలు మద్దతు వెనుక..
పేద ప్రజలు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అయితే సమాజంలో మిగతా వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణంగా వ్యతిరేకించాయి. దానికి ప్రభుత్వ వైఫల్యాలు తోడయ్యాయి. ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలు అండగా నిలవడానికి మాత్రం ముఖ్య కారణం వాలంటీర్లే. అంతగా పేద ప్రజలతో మమేకమై పనిచేశారు వాలంటీర్లు. 2019 ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని రకాల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అదే ప్రధాన కారణం. కానీ వాలంటీర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యతిరేకించడం, ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతోనే వైసీపీకి షాక్ తగిలింది. ఓటింగ్ శాతం ఉన్న పరాజయం ఎదురయింది అందుకే. దానిని గుర్తించలేని స్థితిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* మానస పుత్రిక పై నిర్లక్ష్యం..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వాలంటీర్ వ్యవస్థను తన మానస పుత్రికగా భావించారు. ఆ వ్యవస్థ తనను గట్టెక్కిస్తుందని నమ్మకంగా మాట్లాడారు. అయితే వాలంటీర్లు పనిచేశారు కానీ.. వారిని వ్యతిరేకించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం పనిచేయలేదు. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు వస్తే తమకు పదివేల రూపాయల వేతనంతో ఉద్యోగం ఖాయమని కొంతమంది వలంటీర్లు భావించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మరి కొంతమంది రాజీనామా చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోక పోగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమకోసం ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు సైతం ఆశలు వదులుకున్నారు.