Visakhapatnam: విశాఖకు( Visakhapatnam) పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు రావడమే కాదు.. కార్యకలాపాలు కూడా ప్రారంభిస్తున్నాయి. ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. టిసిఎస్ సైతం మొదలెట్టింది. స్టార్టప్ కంపెనీల గురించి చెప్పనవసరం లేదు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర పడిన క్షణం నుంచి ఐటీ పరిశ్రమల రాక ప్రారంభం అయింది. తాజాగా కాగ్నిజెంట్ తన శాశ్వత భవన నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉంది. ఇంకో వైపు రిషికొండ ఐటి హిల్స్లో తాత్కాలిక కార్యకలాపాలు కూడా ప్రారంభించింది. 2029 నాటికి విశాఖ నుంచి పదివేల మంది ఉద్యోగులతో కాగ్నిజెంట్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.
* 12న కాగ్నిజెంట్ భవనాలకు శంకుస్థాపన.. కాగ్నిజెంట్( Cognizant ) అనేది దేశంతో పాటు జాతీయస్థాయిలో అభివృద్ధి చెందిన ఐటీ సంస్థ. లక్షలాదిమంది ఉద్యోగులతో దిగ్విజయంగా నడుస్తోంది. అటువంటి ఐటీ పరిశ్రమ విశాఖ వస్తుండడంతో భవిష్యత్తులో ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆ సంస్థకు కాపులుప్పాడలో 22 ఎకరాలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం. వీటితో అక్కడే శాశ్వత భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది కాగ్నిజెంట్. 2029 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. దాదాపు 1600 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ భవనాల నిర్మాణం జరగనుంది.
* విశాఖలో జోష్..
దిగ్గజ ఐటీ పరిశ్రమలు( it industries) విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించడంతో ఒక రకమైన జోష్ నెలకొంది. ఇప్పటికే ఐటి హబ్ గా విశాఖను మార్చుతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రయత్నాలు అన్ని కొలిక్కి వస్తున్నాయి. ఒక విధంగా ఇది రాజకీయ ప్రత్యర్థులకు ఇబ్బందికరమే. అందుకే ఇప్పుడు కొత్త విమర్శను తెరపైకి తెచ్చారు. పెట్టుబడులన్నీ విశాఖకే నా అని ప్రశ్నిస్తున్నారు. తద్వారా కూటమి ప్రభుత్వం విశాఖలో పెట్టుబడులను తెస్తోందన్న విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. కానీ అమరావతి రాజధాని నిర్మాణంతో ఒక రకమైన జ్యూస్ ఉండగా.. తయారీ పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి ప్రజల్లో సంతృప్తిని చూస్తోంది ప్రభుత్వం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. విశాఖకు పరిశ్రమలు వస్తుంటే కళ్ళున్నా.. చూడలేని స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండడం మాత్రం ఈ రాష్ట్ర ప్రజల శాపం.
* విశ్లేషకుల ముసుగులో..
ఒక్క విశాఖకే పరిశ్రమలన్నీ వస్తే రాజధాని పరిస్థితి ఏంటి? అనే కొత్త వాదనను తెస్తున్నారు వైసిపి మేధావులు. విశ్లేషకుల రూపంలో అవతారం ఎత్తిన వైసీపీ బ్యాచ్ ఇప్పుడు అదే ప్రధానాస్త్రంగా చేసుకుంటోంది. అమరావతిలో ఇప్పుడు ప్రభుత్వ పరంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలకు సంబంధించి భవనాల నిర్మాణం జరుగుతుంది. ఏకకాలంలో 25 బ్యాంకులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం అయ్యింది. దాదాపు 50 ఎకరాల ప్రాంగణంలో ఈ నిర్మాణాలను మొన్ననే ప్రారంభించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. కానీ అవేవీ వైసీపీ అనుకూల బ్యాచ్కు కనిపించడం లేదు. రాష్ట్రానికి వరదలా పరిశ్రమలు వస్తుంటే వ్యతిరేక ప్రచారం చేయడమే వారి ముఖ్య ఉద్దేశం. అంతకుమించి ఏమి ఉండదు కూడా..