Visakhapatnam: కూటమి ప్రభుత్వ కృషి ఫలిస్తుంది. విశాఖను ఐటి హబ్( IT hub) గా మార్చాలన్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా మరో కీలక అప్డేట్. లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆసక్తి వ్యక్తం చేసింది. దసలవారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఇప్పటికే టిసిఎస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. వచ్చే నెల ప్రారంభం కానుంది. ఆ సందర్భంలోనే డేటా సెంటర్ ఏర్పాటుపై ఒక్క ప్రకటన చేయనుంది టిసిఎస్.
* దేశానికి తలమానికం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో( artificial intelligence) దేశానికే విశాఖ తలమానికంగా నిలిచే అవకాశం ఉంది. ఏఐ నగరంగా రూపుదిద్దుకోనుంది. టాటా సెంటర్లను కేంద్రంగా చేసుకొని ఏఐ స్టార్టప్ లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హై స్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, విహెచ్ఎఫ్ఎక్స్, ఏ ఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరోవైపు 56 వేల కోట్ల రూపాయలతో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే గూగుల్ అంగీకారం తెలిపింది. నవంబర్లో ఒప్పందం జరగనుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా రూ.87,520 కోట్ల పెట్టుబడులతో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్రపడింది. మరోవైపు సిఫీ టెక్నాలజీస్ 16 వేల కోట్ల పెట్టుబడులతో డాక్టర్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.
* దేశంలోనే ప్రత్యేక గుర్తింపు..
ప్రస్తుతం వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు చూస్తుంటే దేశంలోనే విశాఖ నగరం ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం విశాఖ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎంపీటీసీ రెండు లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేస్తోంది. అర్స్లార్ మిత్తల్ సంస్థ లక్ష 30 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ, క్యాపిటల్ పోర్టు అభివృద్ధి చేయనుంది. తాజాగా డేటా సెంటర్లతో కలుపుకుంటే విశాఖకు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు. నిజంగా ఇది కూటమి ప్రభుత్వం చూపిన చొరవ.