Visakhapatnam Investment Summit: ప్రపంచం మొత్తం విశాఖ( Visakhapatnam) వైపు చూస్తోంది. పెట్టుబడుల సదస్సు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత భారీగా పరిశ్రమలో ఏపీకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. గత ఏడాదిగా సన్నాహాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతు సహకారం అందిస్తోంది. దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా.. దానికి అనుబంధంగా వివిధ హాల్ లను ఏర్పాటు చేశారు. అక్కడే వివిధ ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి.
* ఈ సదస్సు ఎన్నెన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సైతం హాజరవుతారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్, సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ హాజరవుతారు.
* ఉదయం 10:30 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. వివిధ కాన్ఫరెన్స్ హాళ్లలో ప్లీనరీ సెషన్స్ కొనసాగనున్నాయి.
* రెండో రోజు శనివారం ఉదయం 9:30 గంటల నుంచి సదస్సు ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు సదస్సు ముగింపు ఉత్సవం నిర్వహించనున్నారు.
* ఈ సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు రానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
* ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది. ఏపీలో పెట్టుబడుల సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల సైతం ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.