Viral Video : ఏపీలో( Andhra Pradesh) పోలీసుల వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. నిందితుల విచారణ పేరిట వారిపై అమానుషంగా వ్యవహరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన పోలీస్ శాఖ అధికారులు సదరు పోలీసులపై చర్యలకు దిగినట్లు సమాచారం. తెనాలిలో గంజాయి మత్తులో జాన్ విక్టర్, రాకేష్, బాబూలాల్ అనే ముగ్గురు వ్యక్తులు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారని గత నెల 27న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారిపై విచారణ పేరుతో పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఆ పత్రికాధిపతి ఛీ పో అన్నాడు.. మంత్రిగారు ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
* గంజాయి మత్తులో దాడి..
అయితే ఈ కేసులో పోలీసుల వాదన వేరేలా ఉంది. గంజాయి మత్తులో ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే వీరిపై కేసులు, రౌడీ షీట్లు ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలోనే వారిని ఐతానగర్ ప్రాంతానికి తీసుకెళ్లి శారీరకంగా శిక్షించినట్లు తెలుస్తోంది. టూ టౌన్ సిఐ రాములు నాయక్, త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు నడిరోడ్డు మీద వారి అరికాళ్ళపై లాఠీలతో అమానుషంగా కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే వారిలో ఒకరు దెబ్బలకు పాల లేక కాళ్లు ముడుచుకున్నారు. అయితే సిఐ రాములు నాయక్ బూటు కాళ్లతో తొక్కి పట్టుకున్నారు. కర్రతో బలంగా కొట్టారు. అయితే ఈ వీడియో బయటకు రావడంతో మరింత వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా నిందితుల్లో ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. మరో మైనర్ గా తెలుస్తోంది. అయితే పోలీసులు చట్టపరంగా వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. కానీ అలా చేయకుండా నేరుగా తామే శిక్షించడం ఇప్పుడు విమర్శలకు గురిచేస్తోంది.
* మాజీ మంత్రి అంబటి ట్వీట్
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు’ తప్పు చేసినా వారిని కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఇది బాబు పాలనలో పౌర హక్కులు లేని దుస్థితి ‘ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించడంతో పోలీస్ శాఖ వేగంగా స్పందించింది. వీడియోలో కనిపించిన పోలీస్ అధికారిని తక్షణమే సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖ పరంగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ దృశ్యం తెనాలి నడిరోడ్డు పై…
తప్పు చేసినా కొట్టే హక్కు వీరికి లేదు
పౌరహక్కులు లేని “బాబు పాలన “ఇది!
కదలండి…….న్యాయ పోరాటానికి!@ncbn @naralokesh @Anitha_TDP @APPOLICE100 pic.twitter.com/uiS5Nvzwx7— Ambati Rambabu (@AmbatiRambabu) May 26, 2025