Vijaysai Reddy: రాజకీయాలకు( politics) దూరంగా ఉంటానని చెప్పారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). కానీ అలా ఉండలేకపోతున్నారు. ఒకప్పటి తన పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్న ఆ మధ్యన సిఐడి విచారణకు హాజరైన ఆయన.. ఏకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరి గురించి మాట్లాడారు. కానీ అప్పట్లో తాను వ్యతిరేకించిన పార్టీ గురించి కానీ.. ఏపీలో కూటమి గురించి కానీ ప్రస్తావించలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తత్వం బోధపడింది. ఆయన కూటమి లైన్ లోకి వెళ్లారని అర్థమయింది. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన రాజీనామా చేయడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయింది. అదే స్థానాన్ని విజయసాయి రెడ్డి తో భర్తీ చేస్తారని తెలుస్తోంది. అది కూడా బిజెపి అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతారని సమాచారం. అదే జరిగితే ఏపీలో కూటమికి విజయసాయిరెడ్డి ఒక వరంలా మారుతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా తయారవుతారు.
Also Read: మంత్రితో ఆ వైసీపీ మాజీ మంత్రి రహస్య భేటీ.. నిజం ఎంత?
* కొద్దిరోజుల కిందట రాజీనామా..
కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా తేల్చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అన్న మాదిరిగానే ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అటు తర్వాత వ్యవసాయం చేస్తున్నారో లేదో కానీ తరచూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతిని ప్రత్యేకంగా కలిశారు. మొన్నటికి మొన్న సిఐడి విచారణకు హాజరై మీడియాతో మాట్లాడారు. జగన్ చుట్టూ ఉన్న ఆ నలుగురితో పాటు వై వి సుబ్బారెడ్డి కుమారుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. లిక్కర్ స్కాంనకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కసిరెడ్డి సూత్రధారి అని తేల్చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచిన తాను సహకరిస్తానని చెప్పుకొచ్చారు.
* కూటమికే ప్రయోజనం అని కామెంట్..
అయితే రాజ్యసభ పదవికి( Rajya Sabha ) రాజీనామా చేసిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కూటమి ప్రయోజనాల కోసమే తాను రాజీనామా చేశానన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన రాజీనామా చేసిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేస్తారని తాజాగా తెలుస్తోంది. పైగా ఆయన రాజీనామా చేసి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇదంతా ముందస్తు వ్యూహంతో జరిగిందేనని తెలుస్తోంది. చంద్రబాబు మునుపటి మాదిరిగా విజయసాయి రెడ్డి పై కోపంగా కనిపించడం లేదు. విజయసాయి రెడ్డి పై ఏ టిడిపి నేత వ్యాఖ్యానించడం లేదు. తద్వారా విజయసాయిరెడ్డి విషయంలో టిడిపి సాఫ్ట్ గా ఉందని అర్థమవుతోంది.
* బిజెపి అభ్యర్థిగా బరిలోకి..
అయితే జూన్లో రాజ్యసభకు సంబంధించి ఖాళీలు భర్తీ చేస్తారు. అందులో భాగంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే విజయసాయిరెడ్డిని బిజెపి అభ్యర్థిగా బరిలో దించనున్నారు. తద్వారా ఆయన ఎన్నికకు టిడిపి తో పాటు జనసేన సహకరించడం ది. విజయసాయిరెడ్డి బిజెపి సభ్యుడిగా కొనసాగుతారు. బిజెపి నేతగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తారు. గతంలో తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కావడంతో ఆ పార్టీ వ్యవహారాలు మొత్తం తెలుసు. అంటే విజయసాయిరెడ్డి సేవలను అలా వాడుకుంటారు అన్నమాట.
Also Read: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ కూ చోటు.. పోటీపడే 6 జట్లు ఏవంటే?