Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy BJP entry: బిజెపి కోసం విజయసాయి ఆరాటం!

Vijaya Sai Reddy BJP entry: బిజెపి కోసం విజయసాయి ఆరాటం!

Vijaya Sai Reddy BJP entry: విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వైఖరి స్పష్టమవుతోంది. ఆయన బిజెపికి దగ్గర కావాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. సరిగ్గా ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామాతో కూటమికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పి.. తెర వెనుక ఏం జరిగిందో వ్యక్తం చేశారు. అయితే ఆయనకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదో.. లేకుంటే రాజకీయంతోనే మంచి గుర్తింపు సాధిస్తుంది అని భావిస్తున్నారేమో తెలియదు కానీ.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే కూటమిలోని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వీలులేదు. జనసేనలో చేరేందుకు ఆప్షన్ లేదు. ఆయనకు ఉన్నదంతా బిజెపితోనే. అయితే టిడిపి నుంచి ఆయన చేరికకు అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో కేంద్ర పెద్దలు.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

కూటమి విడిపోకపోతే అంటూ..
అయితే ఏపీలో కూటమి విడిపోవాలంటే తనలాంటి వాడు ఉండాలని జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) విజయసాయిరెడ్డి సంకేతాలు పంపారు ఆ మధ్యన. ఓటమి ఉన్నంతవరకు అధికారంలోకి రాలేదని కూడా తన పాత బాస్ కు చెప్పేసారు. తద్వారా బిజెపిలోకి వెళ్లి కూటమిని విచ్ఛిన్నం చేస్తానని సంకేతాలు పంపగలిగారు. అయితే ఇప్పుడు అదే పనిపై ఉన్నట్టు ఉన్నారు. తాను బిజెపికి దగ్గరవుతున్నారన్న సంకేతాలు ఇచ్చేలా ఆయన తాజాగా ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. దేశభక్తిని చాటుకు బిజెపికి అనుకూలంగా ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు హార్ట్ టాపిక్ అవుతున్నాయి.

అప్పట్లో అలా..
బిజెపి పెద్దలను కాక పట్టణంలో ముందుంటారు విజయసాయిరెడ్డి. 2018లో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడానికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సహకారం అందడానికి విజయసాయిరెడ్డి వారధిలా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే పనితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇకపై వందేమాతరం పూర్తిగా పాడాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనమంతా సమర్థించాలి అంటూ సాయి రెడ్డి ట్విట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇది బిజెపికి దగ్గర అయ్యే ప్రయత్నం గా తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి కేంద్రంలో ఉన్న బిజెపికి, బిజెపి పెద్దలకు పొగడ్తల కోసమే సోషల్ మీడియాను వినియోగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి అదే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమవుతోంది. బిజెపిలో చేరేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి బిజెపి నుంచి అనుకూల సంకేతాలు వస్తాయా? టిడిపి అడ్డగింతతో ఆగిపోతాయా అన్నది తెలియాల్సి ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular