Vijaya Sai Reddy
Vijaya Sai Reddy: ఈ క్రతవు మొత్తం పూర్తయిన తర్వాత.. తనను కలిసిన వారితో మాట్లాడేవారు. వారి సమస్యలు నేరుగా అక్కడికక్కడే పరిష్కరించేవారు. అయితే ఇసుకను నెట్టే క్రమంలో.. బుట్టెడు గారెలు తినే యజ్ఞంలో.. కోడిని లాగించే సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ తో ఎవరూ మాట్లాడే వారు కాదు. చివరికి కుటుంబ సభ్యులు కూడా కల్పించుకునే వారు కాదు. ఆ పనిలో సీనియర్ ఎన్టీఆర్ ఆనందం వెతుక్కునేవారు. తను తినే తిండిలో తన్మయత్వం పొందేవారు. ఆ తర్వాతే ఆయన తన దైనందిన వ్యవహారాలను ప్రారంభించే వారు. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత మనిషికి డబ్బుపై విరక్తి కలుగుతుంది. పదవిపై యవగింపు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలపై చికాకులేస్తుంది. అందువల్లే ఆ సమయంలో మనిషికి స్వీయ ఆనందంపై మక్కువ కలుగుతుంది. అది ఎందులో లభిస్తుందో తాపత్రయం మొదలవుతుంది. అందువల్లే దానికోసం వారు వెంపర్లాడుతుంటారు. చివరికి తమకు ఆత్మీయ ఆనందాన్ని కలిగించే పని ఏదో తెలుసుకుంటారు. అందులో నిమగ్నం అవుతుంటారు.. కేవలం సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు.. సమాజంలో లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులు మొత్తం చివరికి చేసేది ఇదే. అంతటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నేటికీ తన వ్యవసాయ క్షేత్రాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉంటున్నారు. ఆయన తలచుకుంటే ప్రపంచం మొత్తాన్ని చుట్టి రాగలరు. ఏదైనా చేయగలరు.. కాకపోతే అవన్నీ ఆయనకు ఆత్మీయమైన ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఆ మట్టిలో.. ఆ మట్టి ఆధారంగా చేసుకొని పెరుగుతున్న పంటచేలలో.. ఆయన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.. అనుభవిస్తున్నారు కూడా. తన కాలికి గాయమైనప్పటికీ.. కొంతకాలం మాత్రమే నంది నగర్ లో కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు. స్వయంగా కారు నడిపారు. పచ్చటి చేయడం మధ్య సెల్ ఫోన్ ఎలా వాడాలో తన మనవడు హిమాన్షురావు చెపుతుంటే నేర్చుకుంటున్నారు.
ఇప్పుడు విజయసాయిరెడ్డి వంతు
వైసీపీలో మొన్నటిదాకా కీలకమైన నాయకుడిగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. జగన్ ఆస్తుల కేసుల్లోనూ ఆయన రెండవ నిందితుడిగా ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు రాజకీయాలనుంచి దూరంగా వెళుతున్నట్టు ప్రకటించారు. సహజంగా విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇటువంటి ప్రకటనను వైసీపీ నాయకులు కూడా ఊహించి ఉండరు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి తన ప్రకటనకు కట్టుబడి ఉన్నారు. రాజకీయాల నుంచి నిష్క్రమించారు. అంతేకాదు తనకి ఇష్టమైన వ్యవసాయాన్ని మొదలుపెట్టారు.. ఎక్కడో దూరంగా ఉన్న అడవుల్లో స్వయంగా జీపు నడుపుకుంటూ.. సెలయేటి మధ్యలో ప్రకృతి జీవనాన్ని ఆస్వాదిస్తూ ఆయన కనిపించారు. ఈ ఫోటోలను తన సామాజిక మాధ్యమాలలో ఆయన పోస్ట్ చేశారు.. తనకి ఇష్టమైన హార్టికల్చర్ వైపు అడుగులు వేస్తున్నట్టు ఆయన రాసకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు.. కెసిఆర్ కావచ్చు.. విజయసాయిరెడ్డి కావచ్చు.. అంతిమంగా ఆత్మీయ ఆనందం ఇచ్చేది ఇష్టమైన పని మాత్రమే.. డబ్బు, హోదా, పదవి, కీర్తి ప్రతిష్టలు ఒక స్థాయి వరకే బాగుంటాయి. అందువల్లే పన్నీరు బాగా వాసన వస్తుందని మంచినీళ్ళలాగా తాగేయలేం.. కేవలం ఒంటికి మాత్రమే పూసుకుంటాం.. అర్థం చేసుకున్న వాళ్లకు అర్ధమైనంత..
I am happy to share that I have embarked on a fresh approach to my horticulture operations. pic.twitter.com/q2Gq5UNGgN
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025