https://oktelugu.com/

Chandrababu : నీ అభిమానం చల్లగుండ.. మా ‘బాబు’ను ఏం చేస్తావే తల్లీ.. ముద్దు పెట్టిన మహిళ వీడియో వైరల్

చుట్టూ సెక్యూరిటీ.. అధికారుల కోలాహలం.. భారీగా వచ్చిన ప్రజలు.. ఇంత హడావిడి మధ్య చంద్రబాబు విశాఖపట్నం పర్యటన సాగింది. ఆ పర్యటనలో చంద్రబాబు ఊహించని సంఘటన జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 2, 2024 10:39 pm

    Video of woman hugging and kissing Chandrababu goes viral

    Follow us on

    Chandrababu : జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిషికొండను తొలచి ప్యాలస్ నిర్మించారు. మొదట్లో దానిని అధికారిక నివాసం అని పేర్కొన్నారు. ఆ తర్వాత టూరిజం కోసం నిర్మించామని చెప్పారు. ఆ తర్వాత మరో మాట చెప్పడానికి వైసీపీ నాయకులు అధికారంలో లేకుండా పోయారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి రిషికొండ మీద సాగిస్తున్న భవన నిర్మాణాన్ని అనేక సందర్భాల్లో తప్పు పట్టింది. ప్రభుత్వ ధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించింది. ఒకానొక సందర్భంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ నాటి వైసిపి ప్రభుత్వం దానిని అడ్డుకుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో విశాఖపట్నంలో పర్యటించినప్పుడు రిషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించడానికి వెళ్లగా.. నాటి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన హోటల్ గది నుంచే తన నిరసనను వ్యక్తం చేశారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ నాటి వైసిపి ప్రభుత్వం రిషికొండ పై భవనాన్ని నిర్మించడానికే ముందడుగు వేసింది. ఎట్టకేలకు దానిని పూర్తి చేసింది. ఆ భవనం కోసం వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిందని టిడిపి, జనసేన నాయకులు ఆరోపించారు. అంత ఖర్చు చేయలేదని.. తక్కువ ధరలోనే దానిని పూర్తి చేసామని వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి. కానీ ఈ లోగానే వైసిపి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో గెలిచిన ఆ పార్టీ.. 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 సీట్ల పరిమితం అయిపోయింది.

    హాట్ టాపిక్ గా..

    కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రిషి కొండపై నిర్మించిన ప్యాలెస్ ప్రధాన వార్తల్లో నిలిచింది. ఆ భవనం నిర్మించిన తీరు.. దానికి అద్దిన హంగులు.. చేసిన ఖర్చు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ భవనాన్ని అచ్చెన్నాయుడు, టిడిపి నాయకులు పరిశీలించి.. నాడు ఆ భవన నిర్మాణం కోసం ఎంత ఖర్చు చేశారు? ఎక్కడినుంచి సామగ్రి తెప్పించారు? ఇందులో నాడు వైసిపి నాయకులు ఎంత నొక్కేశారు? అనే విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. దీనిని వైసీపీ ఖండించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    చంద్రబాబు పర్యటన

    ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా రిషికొండ వద్ద నిర్మించిన ఆ ప్యాలెస్ ను పరిశీలించారు.. అందులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఇంతటి స్థాయిలో రాజ సౌధాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని.. జగన్ ప్రభుత్వ ధనాన్ని ఇలా ఖర్చు చేశాడు కాబట్టే ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన రిషికొండ వద్ద ఉన్న ప్యాలస్ వద్దకు వెళుతుండగా.. ఒక మహిళ అంతటి సెక్యూరిటీని కూడా ఛేదించుకొని చంద్రబాబు వద్దకు వచ్చింది. చంద్రబాబును గట్టిగా పట్టుకుంది. చంద్రబాబు వారిస్తున్నప్పటికీ ఆమె ఆయనను వదిలి వెళ్ళలేదు. పైగా ఆయనకు ముద్దు ఇవ్వడానికి ప్రయత్నించింది. చివరికి ఇచ్చేసింది కూడా.. అసలే ఇది సోషల్ మీడియా కాలం.. పైగా ఎప్పుడు ఎలాంటి వీడియో దొరుకుతుందా అని ప్రత్యర్థులు ఎదురుచూసే కాలం.. ఇంకేముంది చంద్రబాబు ను ఆ మహిళ ముద్దు పెట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి. దీనికి అదే స్థాయిలో టిడిపి శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. అయితే అంతటి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఆ మహిళ చంద్రబాబుకు ముద్దు పెట్టడానికి ముందుకు రావడం విశేషం.