Ongole breed cow : ఒంగోలు( Ongole) జాతి ఆవుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఇక్కడి ఆవులు. తాజాగా ఒంగోలు జాతి మూలాలు ఉన్న ఆవు ఏకంగా 40 కోట్లు పలకడం విశేషం. బ్రెజిల్ లో వియాటినా19 అనే ఒంగోలు జాతి మూలాలు ఉన్న ఆవు 4.8 మిలియన్ డాలర్ల ధర పలికింది. ఇది అక్షరాల మన కరెన్సీ 40 కోట్ల పైమాటే. ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా ఇది గుర్తించబడింది. నెల్లూరుకు చెందిన ఈ ఆవు ఒంగోలు జాతికి దగ్గరగా ఉంటుంది. దాని మూలాలు స్పష్టంగా కనిపిస్తాయి.
* ప్రత్యేక లక్షణాలు
ఈ ఆవు( cow) ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది. బరువుతో పాటు బలంలో కూడా ప్రత్యేకత చాటుకుంటూ వస్తోంది. జన్యు లక్షణాలు, శరీర నిర్మాణం, సంతానోత్పత్తి పరంగా విటియానా ఆవు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. దాదాపు 1000 కిలోలకు పైగా బరువు ఉంటుంది. సాధారణ ఆవులతో పోలిస్తే బరువు, బలం అధికంగా ఉంటుంది. పశు పోషణ, ఉత్పత్తిలో బ్రెజిల్ దేశం ముందుంటుంది. అక్కడ ఈ జాతిదే కీలక పాత్ర. దీని మూలాలు మన ఒంగోలు జాతికి దగ్గరగా ఉండడం విశేషం.
* పాడి ఉత్పత్తుల్లో అగ్రస్థానం
పాడి ఉత్పత్తులతో( dairy products ) పాటు పసుమాంసం ఎగుమతిలో బ్రెజిల్ దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. అందుకే ఈ అరుదైన వియాటినా 19 అందాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.వియాటినా మూ జెనిక్స్ పద్ధతిలో జన్మించింది. సీరోగసి పద్ధతిలో ఆవుల్లో ప్రత్యేక పిండాలను లోనింగ్ చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. అందుకే దీని అండాలు కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి.
* దాని మూలం ఇక్కడే..
అయితే ఈ ఆవు మూలం మన ఒంగోలు( Ongole) జాతికి చెందినది. 1868 లో వాడ ఇండియా నుంచి విలువైన వస్తువులతో ఇంగ్లాండ్ బయలుదేరి బ్రెజిల్ తీరానికి చేరుకుంది. ఆ సమయంలో వాడలో ఉన్నటువంటి రెండు నెల్లూరు జాతి పశువులను స్థానిక వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో నాటి నుంచి బ్రెజిల్ లో ఒంగోలు జాతి పశుపాసన ప్రారంభం అయింది. నాటి నుంచి 1962లో భారత ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించే వరకు లక్షలాది ఒంగోలు జాతి పశువులు తరలిపోయాయి. ఒక్క బ్రెజిల్ కే కాదు ప్రపంచంలోనే అగ్రదేశాలకు సైతం ఈ ఆవులు వెళ్లాయి. ఎలాంటి వాతావరణం లో అయినా చక్కగా ఇమిడిపోవడం ఒంగోలు జాతి ఆవుల ప్రధాన లక్షణం. బ్రెజిల్ లో పశు పోషణకు సంబంధించి చాలా రకాల అనుకూలతలు ఉన్నాయి. అందుకే అక్కడ ఒంగోలు జాతి ఆవులు వృద్ధి చెందుతూ వస్తున్నాయి.