Venu Swamy Assam Trip: పగలైతే యోగి.. రాత్రి అయితే భోగి.. ఓ సినిమాలో బ్రహ్మానందం చెబుతాడు గుర్తుందా.. వేణు స్వామి కూడా అంతే. నిండుగా కాషాయం లేదా పసుపు రంగు దుస్తులు వేసుకుంటాడు. నిండైన జుట్టుతో.. ఒత్తయిన మీసంతో కనిపిస్తుంటాడు. మెడలో కొన్ని రుద్రాక్ష మాలలు.. ఎత్తుకు ఎత్తు, దానికి తగ్గట్టుగా శరీర సౌష్టవంతో దర్శనమిస్తుంటాడు.
ఓ సినీ జంట విడాకులు తీసుకుంటుందని అతడు ముందుగానే చెప్పాడు. ఆ తర్వాత అది నిజమైంది. ఇక అప్పటినుంచి అతడిని మీడియా వదిలిపెట్టలేదు. వచ్చిన అవకాశాన్ని వేణు స్వామి కూడా విడిచిపెట్టలేదు. దానిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.. బీభత్సంగా క్యాష్ చేసుకున్నాడు. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన అతడు.. మీడియాలో వచ్చిన హైప్ ఆధారంగా భారీగా వెనకేసుకున్నాడు. హైదరాబాదులో అతడికి విలాస కేంద్రాలు, విడిది కేంద్రాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే విషయాన్ని అతడు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. క్లబ్బులు, పబ్బులతో అమ్మవారి పూజలు ఎలా చేస్తారని అడిగితే ” అదివృత్తి ఇది ప్రవృత్తి అని” సమాధానం చెప్పాడు వేణు స్వామి.
Also Read: వేణు స్వామి దొరికాడు.. అడ్డంగా వాయించారు.. వీడియో వైరల్
వేణు స్వామి గత కొంతకాలంగా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నాడు. ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇక అప్పటినుంచి ఆయన పూజలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఆయన అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్ళాడు. ఆ ఆలయంలో పూజలు చేసినట్టు తెలుస్తోంది. కామాఖ్య దేవాలయ పరిసర ప్రాంతాలు క్షుద్ర పూజలకు ఆలవాలం. ఇన్ని రోజులు సాధారణంగా ఉన్న అతడు.. ఇప్పుడు అస్సాం వెళ్లడం సంచలనం కలిగిస్తోంది. ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో పంచుకునే వేణు స్వామి.. అస్సాం వెళ్లిన విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడు. అయితే అస్సాం వెళ్లిన వేణు స్వామిని ఓ పూజారి దూషించాడు. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ వేణు స్వామిని అతడు దూషించాడు. కానీ వేణు స్వామి అతడు అడిగిన ప్రతి ప్రశ్నకు నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఇంతకీ వేణుస్వామి అక్కడ ఏం చేశాడు? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.