Vallabhaneni Vamsi: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది వివిధ కేసుల్లో అరెస్టు అయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చి యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ మాత్రం అటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు గన్నవరంలో అడుగుపెట్టడం లేదు. సొంత వారి దగ్గరకు కూడా చేరడం లేదు. అదే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించే విషయం. గన్నవరంలో వల్లభనేని వంశీ మోహన్ ను మార్చి కొత్త ఇన్చార్జిని తెస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఓ కాంగ్రెస్ మహిళా నేత పేరు వినిపిస్తోంది. ఆమె అయితేనే అక్కడ రాజకీయాలను తట్టుకోగలరు అనేది పొలిటికల్‌గా వినిపిస్తున్న మాట. వల్లభనేని వంశీ మోహన్ పై జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది.
* అందగాడుగా పేరు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందగాడుగా వల్లభనేని వంశీ మోహన్ కు పేరు ఉంది. ఎందుకంటే వల్లభనేని వంశీ మోహన్ అందాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారని.. ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అప్పటినుంచి వైసిపి అందగాడుగా వల్లభనేని వంశీ మోహన్ కు పేరు ఉంది. కానీ ఆ అందం జైలుకు వచ్చిన తర్వాత కనిపించలేదు సరి కదా.. అసలు పోల్చుకోలేకపోయారు కూడా. అంతలా కళావిహీనం అయ్యారు వల్లభనేని వంశీ మోహన్.
* అనుచిత వ్యాఖ్యలతో..
2019లో రెండోసారి టిడిపి తరఫున గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. రాజకీయాల్లో జంపింగులు సహజమే. కానీ అంతకుమించి అన్నట్టు వ్యవహరించారు వల్లభనేని. చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్లు చేయడంతో పాటు భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజంలో చులకన అయ్యారు. తలెత్తుకో లేని విధంగా మారారు. అయితే ఇప్పుడు అదే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం లో యాక్టివ్ గా లేకపోయేసరికి… జగన్మోహన్ రెడ్డి మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. ఆమె సైతం బాధ్యతలు ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
