Tirumala Tirupati Devasthanam : గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో( Tirupati) విషాద ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది టిటిడTirumala Tirupati Devasthanam : తిరుపతిలో తొక్కిసలాట నేపథ్యంలో టీటీడీ( Tirumala Tirupati Devasthanam) కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియపై ప్రత్యేక ప్రకటన చేసింది. జనవరి 10,11, 12 తేదీలకు సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయినట్లు తాజాగా వెల్లడించింది. జనవరి 13 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఏ రోజుకు ఆ రోజు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో తిరుమలలో పటిష్ట చర్యలు చేపడుతోంది. బుధవారం జరిగిన టిక్కెట్ల జారీ పంపిణీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆరుగురు భక్తుల మృత్యువాతతో విషాదం అలుముకుంది. ఈ నేపథ్యంలో తొలి మూడు రోజులకు సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియను టిటిడి పూర్తి చేసింది. మొత్తం 1.20 లక్షల టోకెన్లను జారీ చేయాలని ముందుగా నిర్ణయించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఈ మొత్తం టోకెన్లను జారీ చేసినట్లు తెలిపింది.
* 90 కౌంటర్లలో
వైకుంఠ ద్వార దర్శనం కోసం నిత్యం 40,000 టోకెన్ల చొప్పున టీటీడీ( TTD) అధికారులు జారీ చేశారు. ఈ టోకెన్ల జారీ కోసం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేసి అందించగలరు. అయితే ఈ టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే ఈ మూడు రోజులు పాటు శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం ఒక్కసారిగా ఎగబడడంతోనే తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో 13వ తేదీ నుంచి దర్శన టోకెన్లకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజే అందించనున్నారు. మరోవైపు తాజా ఘటన నేపథ్యంలో టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం సైతం అలర్ట్ అయ్యింది.
* ఏ రోజుకు ఆరోజు జారి
అయితే ఏ రోజుకు ఆ రోజు టోకెన్ల జారీకి సంబంధించి తిరుపతిలోని శ్రీనివాసం( srinivasam), విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద జారీ చేయనున్నారు. మరోవైపు 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తికానున్నాయి. సాధారణంగా ఏటా మూడుసార్లు స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి తొక్కిసలాట జరిగింది.
* పటిష్ట భద్రత
అయితే ఈ తొక్కిసలాట నేపథ్యంలో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు( full security ) చేపట్టడానికి టిటిడి డిసైడ్ అయింది. టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకమైన సీనియర్ అధికారుల( senior officers) పర్యవేక్షణలో టోకెన్ల జారీ ప్రక్రియ జరగనుంది.