Perni Nani: మీడియా వ్యాప్తి పెరిగిపోయిన తర్వాత.. సోషల్ మీడియా విస్తృతి ఎక్కువైన తర్వాత.. రాజకీయ నాయకులు ప్రచారాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. మీడియా సంస్థలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఏదో ఒక విషయాన్ని.. జనాల నోళ్ళల్లో నానే విధంగా చేస్తున్నాయి. వాస్తవానికి రాజకీయ నాయకులు ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ప్రచారాన్ని కోరుకుంటున్నారు. అందువల్ల నిత్యం మీడియాలో ఉండడానికి ఇష్ట పడుతున్నారు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసిలు చేసి నిత్యం వార్తల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. దానివల్ల జనాలకు జరిగే మంచి విషయం పక్కన పెడితే.. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అలాంటి విషయమే ఇప్పుడు తెలిసింది.
టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ ఒకప్పటి మాదిరిగా డిబేట్ లు నిర్వహించడం లేదు. ఆయన కేవలం ప్రతి ఆదివారం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమవుతున్నారు.. ప్రతి ఆదివారం రాత్రి ఈ ఇంటర్వ్యూ ప్రసారమవుతున్నది. ఇంటర్వ్యూలో భాగంగా అధికార, ప్రతిపక్ష నాయకులను ఆయన పిలుస్తున్నారు.. తనదైన ప్రశ్నలు వేస్తూ వాటి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. తాజాగా వైసిపి నేత పేర్ని నాని ని రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు అడిగారు.. కొన్ని ప్రశ్నలకు నాని గుక్క తిప్పుకోకుండా సమాధానం చెబితే.. మరి కొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలారు. ఇంకా కొన్ని ప్రశ్నలకు అయితే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు.. ముఖ్యంగా లిక్కర్ స్కాం, ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి ఓటు వేసిన విధానం.. ఈ అంశాలపై రజనీకాంత్ ప్రశ్నలు అడిగారు. దానికి నాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
ముఖ్యంగా లిక్కర్ స్కాం విషయంలో రజనీకాంత్ అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం మరో విధంగా చెప్పారు. మీ పార్టీ నాయకుడు.. ఒకప్పుడు నంబర్ 2 గా ఉన్న వ్యక్తి లిక్కర్ స్కామ్ జరిగిందని చెబుతుంటే.. మీరు ఏంటి అందులో ఏమీ జరగలేదని అంటున్నారని రజనీకాంత్ ప్రశ్నించారు. దానికి నాని స్పందించారు. ఒకవేళ లిక్కర్ స్కాం గనుక జరిగి ఉండి ఉంటే.. అది విజయ సాయి రెడ్డికి తెలియకుండా ఎలా ఉంటుందని నాని ఎదురు ప్రశ్న వేశారు. అంటే లిక్కర్ స్కాం లో విజయసాయి రెడ్డికి కూడా పాత్ర ఉందా అని రజనీకాంత్ ప్రశ్నిస్తే.. దానికి నాని సమాధానం దాటవేశారు.. ఉపరాష్ట్రపతికి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారని.. ఏపీలో బిజెపి ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న కూటమిని తిడుతూ.. ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడంలో ఆంతర్యం ఏమిటని రజనీకాంత్ ప్రశ్నిస్తే.. ఈ ప్రశ్నకు సమానంగా నాని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని నాని వాపోయారు.. ఈ వీడియోలను కూటమినేతలు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. వైసిపి ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం విఫలమవుతోంది.