Shiva Jyothi: ఇటీవల సమాజంలో గుర్తింపు కోసం చాలామంది ఆరాటపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం కావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మంచేదో చెడేదో గుర్తించడం లేదు. చివరకు దేవుడు విషయంలో కూడా రాజీ పడడం లేదు. ఆ మధ్యన టిటిడిలో స్వామివారి దర్శనానికి వచ్చారు యాంకర్ శివజ్యోతి( anchor sivajyoti ). అలా క్యూ లైన్ లో ఉండగానే ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని.. టీటీడీ ప్రాశస్త్యాన్ని కించపరిచే ఉద్దేశం గా భావించి తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. యాంకర్ శివజ్యోతికి స్వామి వారి దర్శన భాగ్యం లేకుండా నిషేధం విధించింది. నిజంగా ఇది గట్టి హెచ్చరిక. ఎందుకంటే టీటీడీ మనోభావాలను దెబ్బతీసేలా కొంతమంది వ్యవహరిస్తున్నారు. వారికి ఇది చెంపపెట్టు.
* సోషల్ మీడియా విస్తృతం..
ఇటీవల సోషల్ మీడియా( social media) విస్తృతం అయింది. సామాన్యులు సైతం రీల్స్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ కొత్త సంస్కృతిలో. ఇది మరింత శృతిమించి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన చోట సైతం రీల్స్ చిత్రీకరణ జరుగుతోంది. దీనిపై చాలా రకాల ఫిర్యాదులు ఉన్నాయి. చాలా ఘటనలు వివాదాస్పదం అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో క్యూ లైన్ లో ఉన్న యాంకర్ శివజ్యోతి స్వామి వారి అన్న ప్రసాదం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. దానిని తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సీరియస్ గా తీసుకోవడంతో.. కొంత చెక్ పడే అవకాశం ఉంది.
* ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు..
చాలామంది సెలబ్రిటీలు( celebrities) తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావనతో ఉంటారు. ఈ క్రమంలోనే దేవుడు సమక్షంలోనే తప్పులు చేస్తుంటారు. యాంకర్ శివ జ్యోతి అలానే చేశారు. అయితే ఇటీవల టీటీడీ వేదికగా జరుగుతున్న పరిణామాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి వాటికి చెక్ చెప్పాలంటే సీరియస్ యాక్షన్ లోకి దిగాల్సిందే. ఇప్పుడు టీటీడీ చేసింది అదే. యాంకర్ శివ జ్యోతి కి చెక్ చెప్పడం ద్వారా గట్టి సంకేతాలు ఇచ్చింది టీటీడీ. మున్ముందు ఇలాంటి పరిణామాలు ఎదురైతే కఠిన చర్యలు తప్పవని తేల్చింది. మొత్తానికి అయితే టీటీడీలో రెచ్చిపోతున్న వారికి శివజ్యోతి అంశం గట్టి హెచ్చరిక.