https://oktelugu.com/

TTD Chairman: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్రిస్టియన్.. క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం

కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. మరో పది రోజుల్లో ఐదు నెలల పాలన పూర్తి కానుంది. ఈ తరుణంలో టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రకటించింది ప్రభుత్వం. అయితే చైర్మన్ గా ఎంపికైన బి ఆర్ నాయుడు అన్యమతస్తుడు అని ప్రచారం ప్రారంభమైంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 1, 2024 / 11:07 AM IST

    TTD Chairman

    Follow us on

    TTD Chairman: టీటీడీ చైర్మన్ గా నియమితులైన బి.ఆర్ నాయుడు క్రిస్టియనా? అన్య మతస్థుడికి టిటిడి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారా? వైసీపీ చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా టీవీ5 అధినేత బి ఆర్ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. 24 మంది సభ్యులను సైతం నియమించారు. ఏపీలో కూటమి ఎమ్మెల్యేలతో పాటు వివిధ రంగాల నుంచి ఓ 20 మందిని తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెస్ రాజు సభ్యులుగా ఎంపికయ్యారు. అయితే ఏపీ నుంచి ప్రాతినిధ్యం దక్కిన వారి విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి బిజెపి సిఫారసులతో నియమించిన సభ్యుల విషయంలో మాత్రం అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు గురించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే మొదలైంది. ఆయన క్రిస్టియన్ అని..ఇంతకుముందు ఎప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దాఖలాలు లేవని వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది.ప్రత్యేక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.

    * ఆ ప్రచారం ఫేక్
    బి ఆర్ నాయుడు క్రిస్టియన్ అని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.’ టీటీడీ చైర్మన్గా ఎంపికైన బిఆర్ నాయుడు బ్రాండ్ ని మార్ఫింగ్ చేసి, ప్రముఖుల పేరుతో ఫేక్ అకౌంట్లు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. దీని వెనుక వైసిపి కిరాయి మూకలు ఉన్నాయని ఆధారాలు లభించాయి. ఫేక్ అకౌంట్, ఫేక్ ఫెలోస్ కి ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్’ అని టిడిపి సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన వచ్చింది.

    * అప్పట్లో కూడా ఇలానే
    అయితే టీటీడీ చైర్మన్ ల విషయంలో అన్యమత ప్రచారం ఇప్పటిది కాదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. అప్పుడు కూడా సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అటు తరువాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా నియమితులైన సమయంలో సైతం ఇదే తరహా ప్రచారం నడిచింది. కూటమి ప్రభుత్వం మాదిరిగానే అప్పట్లో వైసీపీ సర్కార్.. దానిని ఫేక్ అని తేల్చింది. మొత్తానికైతే టీటీడీ చైర్మన్ భర్తీ విషయంలో అన్యమత అంశం హైలెట్ అవుతుండడం విశేషం.