Amma Vodi : నేడు తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ.. బటన్ నొక్కనున్న జగన్

నేడే తల్లుల ఖాతాలో ప్రభుత్వం రూ.15 వేలు జమ చేయనుంది. పేద విద్యార్థుల చదువుల కోసం ఏటా ప్రభుత్వం రూ.15 వేలు అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. 2023, 24 విద్యాసంవత్సరానికి సంబంధించి అమ్మ ఒడి నగదు సాయం ఈ రోజు జమకానుంది.

Written By: Dharma, Updated On : June 28, 2023 12:52 pm
Follow us on

Amma Vodi : ఏపీలో చదువుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యాస్. నేడే తల్లుల ఖాతాలో ప్రభుత్వం రూ.15 వేలు జమ చేయనుంది. పేద విద్యార్థుల చదువుల కోసం ఏటా ప్రభుత్వం రూ.15 వేలు అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. 2023, 24 విద్యాసంవత్సరానికి సంబంధించి అమ్మ ఒడి నగదు సాయం ఈ రోజు జమకానుంది. సీఎం జగన్ బటన్ నొక్కి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని చిన్నమేరంగిలో ప్రజల సమక్షంలో జగన్ బటన్ నొక్కనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి లోని క్యాంపు ఆఫీసు నుంచి ప్రత్యేక హెలీకాప్టర్ లో చినమేరంగి చేరుకోనున్నారు.

నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మూడుసార్లు అమ్మఒడి పథకాన్ని అమలుచేశారు. తల్లుల ఖాతాల్లో నగదును జమచేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి సాయం. వచ్చే ఏడాది వేసవిలో సాధారణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 2019లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చింది. 2024 మే వరకూ అధికారంలో ఉండనుంది. అయితే ఐదు విద్యాసంవత్సరాలకుగాను కేవలం నాలుగుసార్లు మాత్రమే అమ్మఒడి అమలుచేయడం విశేషం.

సీఎం జగన్ బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించిన తరువాత తల్లుల ఖతాల్లో నగదు జమకానుంది. ఈ రోజు నుంచి వరుసగా పదిరోజుల పాటు ప్రక్రియ కొనసాగుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్,  ప్రైవేట్ అనే తేడాలేకుండా చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోంది.  పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ను తగ్గించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని నూరు శాతం అమలు పరుస్తోంది. దీనికి కనీసం హాజరు శాతం 75 శాతం ఉండాలని నిర్దేశించింది.