Tirumala Silk Shawls Scam : తిరుమల( Tirumala) విషయంలో వివాదాలు ఆగడం లేదు. తిరుమల లడ్డు వివాదం మొదలుకొని.. పరకామణి చోరీ వరకు వైఫల్యాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా పట్టు శాలువాలు బదులు పాలిస్టర్ శాలువాలు అందించి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించారని విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయలు అలా పక్కదారి పట్టించారని తేలింది. దీంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. ఆ శాలువాలకు సంబంధించి టెండర్లను రద్దు చేసింది. దీంతో మరో వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చినట్లు అయింది. ఇప్పటికే లడ్డు తయారీలో నెయ్యి కల్తీ జరిగింది అనే దానిపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. పరకామణి చోరీ కేసులో సైతం అప్పటి పెద్ద పాత్ర ఉందన్న అనుమానంతో విచారణ జరుగుతోంది. ఇప్పుడు శాలువాలకు సంబంధించిన వివాదం హాట్ టాపిక్ అవుతోంది. ఇది కూడా సంచలనాలకు కేంద్ర బిందువు కానుంది.
* వి.వి.ఐ.పిల కోసం..
సాధారణంగా తిరుమల దర్శనానికి వచ్చే వి వి ఐ పి లకు( vvip ) స్వామివారి తీర్థప్రసాదాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆశీర్వచనాలు అందించే సమయంలో శాలువాలు కప్పుతుంటారు. ఇవి పూర్తి పట్టు వస్త్రాలు. కానీ గత కొన్నేళ్లుగా ఇలా కప్పుతున్న శాలువాలు పట్టు వస్త్రాలు కాదు అని.. పూర్తిగా పాలిస్టర్ వస్త్రాలు అని విజిలెన్స్ విచారణలో తేలింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా పట్టు వస్త్రాల బదులు పాలిస్టర్ వాడుతున్నట్లు విజిలెన్స్ బృందం గుర్తించింది. అదే విషయాన్ని టిటిడి పాలకవర్గానికి నివేదించింది. దీంతో టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించి టెండర్లను రద్దు చేసింది.
* పూర్తిగా పాలిస్టర్ తో..
ఒక్కో శాలువా 1400 రూపాయలకు నిర్ధారిస్తూ.. దాదాపు 15 వేల శాలువాలకు టెండర్లు దక్కించుకుంది నగరికి చెందిన ఓ సంస్థ. దాదాపు 54 వేల కోట్ల రూపాయలకు పైగా ఈ టెండర్లు ఖరారు అయ్యాయి. అయితే కనీస స్థాయిలో సైతం శాలువాలో పట్టు శాతం లేదు. పూర్తిగా పాలిస్టర్ గా ఉంది. దానిపై పట్టు వస్త్రం అని హోలోగ్రామ్ కూడా లేదు. గత ఐదేళ్లలో ఈ దందా సాగినట్లు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తిరుమలలో ఎలాంటి వివాదం బయటపడుతున్న దాని వెనుక వైసిపి పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇది నిజంగా ఆ పార్టీకి భారీ డ్యామేజ్ చేస్తోంది. తిరుమల లడ్డు కల్తీ, పరకామణి చోరీ కేసులో వైసీపీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు పట్టు శాలువాల పేరిట కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగిందని వెలుగు చూడడం సైతం వైసీపీలో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే తిరుమల వ్యవహారాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై చెడ్డ పేరు వచ్చింది. హిందూ సమాజంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడింది. ఇప్పుడు సరికొత్త ఈ వివాదం పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయమని వైసిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.