Tirumala Ticket Process: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించాలని ప్రతి ఒక్క తెలుగువారు అనుకుంటూ ఉంటారు. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం తిరుమలను ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఎంతో ప్రయాసపడి సుదూరం నుంచి ప్రయాణాలు చేస్తూ ఇక్కడికి వస్తారు. తిరుపతిలో దేవుడి దర్శనం మాత్రమే కాకుండా ఇక్కడున్న వాతావరణం ఎంతో ఆహ్లదంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చినవారు కనీసం రెండు రోజులపాటు స్టే చేసి సంతోషంగా గడుపుతారు. అయితే తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే మామూలు విషయం కాదు. సాధారణ దర్శనం చేసుకోవాలంటే కనీసం ఒకటి నుంచి రెండు రోజులపాటు క్యూలో నిల్చవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేక రోజుల్లో అయితే మూడు నాలుగు రోజులైనా దర్శనం కాకుండా ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది రూ. 300 దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఈ టికెట్ బుకింగ్ చేసుకుంటే మూడు నెలల పాటు దర్శనం కోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఈ టికెట్ మిస్సయిన మరో మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. అదెలా అంటే?
Also Read: బిజెపికి షాక్.. ఈటెల రాజేందర్ కొత్త పార్టీ..
తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు కొందరు. ఇందులో ముఖ్యంగా దర్శనం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. సెల్లార్ దర్శనంలో ఇబ్బంది ఉంటుంది అని అనుకునేవారు 300 దర్శనం కోసం వేచి చూస్తారు. అయితే ఈ టికెట్స్ బుక్ చేసుకుంటే మూడు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్ స్లాట్ ఓపెన్ కాగానే చాలామంది వెంటనే బుక్ చేసుకుంటూ ఉంటారు. కొందరు స్లాట్ బుకింగ్ రోజున ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్ల వద్ద వెయిటింగ్ చేస్తారు. మరికొందరు చేతిలో మొబైల్ తో టికెట్ ఎలా బుక్ చేయాలా? ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి టికెట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు.
అయితే తిరుపతికి వెళ్లడానికి అన్ని సమయాలు అనుకూలంగా ఉండవు. మనం అనుకున్న సమయంలోనే దర్శనం చేసుకోవాలని అనుకుంటే రూ. 300 టికెట్ దొరకని పక్షంలో.. మరో అవకాశముంది. అవే హోమం టికెట్స్. ఈ టికెట్ రూ.1600 ఉంటుంది. దీనిపై ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు. జూలై 25 వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. దీనిని బుక్ చేసుకున్న వారు 25వ తేదీన 9 గంటల లోపు అలిపిరి వద్ద ఉన్న సప్తగృహ కౌంటర్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ జరిగే హోమంలో పాల్గొనవచ్చు.
Also Read: ఒక్క నిర్ణయం.. ఎంతోమంది హృదయాలు గెలిచిన రేవంత్
ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రూ.300 క్యూలైన్లో పంపిస్తారు. అందువల్ల జూలై నెల కోసం ఇప్పటికే టికెట్ బుక్ చేసుకొని వారు ఈనెల 25వ తేదీన టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే తిరుమలకు వెళ్లినవారు టికెట్ దొరకని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ టికెట్ ద్వారా శ్రీవారిని తొందరగా దర్శనం చేసుకోవచ్చు. అందువల్ల తిరుపతికి వెళ్లాలని అనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.