Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan : పవన్ కళ్యాణ్ చేసిన శపథం ఇదీ

Pawankalyan : పవన్ కళ్యాణ్ చేసిన శపథం ఇదీ

Pawankalyan : వారాహి యాత్రతో పవన్ ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా కీలక నిర్ణయాలు వెల్లడిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతున్నారు. వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. అన్నవరంలో యాత్ర ప్రారంభం నుంచే సెగలు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని ప్రకటిస్తున్నారు. అధికార పక్షం నుంచి కవ్వింపులు, విమర్శలు ఎదురైనా ఇది నా పంథా అంటూ పవన్ సాగుతున్న తీరు వారిని కలవరపాటుకు గురిచేస్తోంది.

పవన్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఉద్యమ నేతలు, సినీ రంగానికి చెందిన వారిని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. పవన్ లో వాడీ వేడీ ఏమాత్రం తగ్గించలేకపోయారు. చురకత్తుల్లాంటి మాటల తూటలతో పవన్ వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. ప్రజాభిమానాన్ని చూరగొంది. పిలవకుండానే జనం తమంతట తాము వచ్చి పవన్ కు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల ప్రజల అభిమానాన్ని చూసి పవన్ ఆనందంతో పరవశించిపోయారు. హాలో ఏపీ బైబై వైసీపీ అంటూ స్లోగన్ ఇచ్చారు. అంతకంటే ముందు గోదావరి జిల్లాల్లో అస్సలు వైసీపీకి స్థానం ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. ఒక్క సీటు కూడా రానివ్వద్దని.. వైసీపీ విముక్త గోదావరి జిల్లాలే తన అభిమతమని ప్రజలకు స్పష్టంగా చెప్పారు. ఎక్కడా వైసీపీని గెలిపించవద్దని కోరారు. అయితే దీనిపై వైసీపీ హైకమాండ్ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా. జిల్లాల్లో నేతలు మాత్రం తమ రాజకీయ జీవితానికి తెరపడినట్టేనని ఆందోళన చెందుతున్నారు.

వారాహి యాత్ర ప్రారంభంలో జనసేనను మాత్రమే గెలిపించాలని ఇచ్చిన పవన్ పిలుపుతో వైసీపీ నేతలు ఖుషీ అయ్యారు. ఇప్పుడు అదే పవన్ వైసీపీని ఓడించాలని కోరడంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. ఏంచేయాలో.. ఎలా ముందుకెళ్లాలో వారికి తెలియడం లేదు. మధ్యలో ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం, పోసాని కృష్ణమురళీ లాంటి వారాని ప్రయోగించి పవన్ లో కసి పెంచారని.. అది మా రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిందని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ శపథం అధికార పార్టీ నేతలను ముచ్చెమటలు పట్టిస్తోందన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular