Homeఆంధ్రప్రదేశ్‌ABN is boycotted: అక్కడ వైసీపీ.. ఇక్కడ బీఆర్‌ఎస్‌..ఏబీఎన్‌ బహిష్కరణ.. ఆ చానెల్‌ కు దారేది..

ABN is boycotted: అక్కడ వైసీపీ.. ఇక్కడ బీఆర్‌ఎస్‌..ఏబీఎన్‌ బహిష్కరణ.. ఆ చానెల్‌ కు దారేది..

ABN is boycotted: దేశానికి నాలుగో స్తంభం మీడియా అంటారు. ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా పనిచేయాలి. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలి. వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాలి. అవినీతి, అక్రమాలను ప్రజలముందు ఉంచాలి. కానీ, ప్రస్తుతం మీడియా పార్టీల వారీగా విడిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంది. నాయకులే పత్రిక,చానల్‌ యజమానులుగా ఉన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాక్షి పత్రిక, టీవీ చానల్‌ నడుపుతున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూస్‌ చానెల్‌ నడుపుతోంది. ఇక మిగతా చానెళ్ల యజమానులు నాయకులు కాకపోయినా.. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని తమ పనులు చేసుకుంటున్నారు. ఇక తమది దమ్మున్న చానల్‌ అని చెప్పుకునే ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ చానెల్‌ యాజమాన్యం జర్నలిజం విలువలకు వలువలు వదులుతోంది. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు కొమ్ము కాస్తూ.. విపక్ష నేతలే లక్ష్యంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ అభాసుపాలవుతోంది.

రెండు పార్టీల బహిష్కరణ..
ఈ ఏబీఎన్‌ చానెల్‌ను ఏపీలో వైసీపీ ఎప్పుడో బహిష్కరించింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్‌ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, ఈనాడుపై విమర్శలు చేసేవారు. ఇక వైసీపీ నాయకులు ఏబీఎన్‌ చానెల్‌లో నిర్వహించే డిబేట్‌లకు వెళ్లడం మానేశారు. అంటే పరోక్షంగా బహిష్కరించారు. తాజాగా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కూడా ఏబీఎన్‌ను బహిష్కరించింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావును ఏబీఎన్‌ తీవ్రంగా అవమానించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

డిబేట్‌కు పిలిచి మరీ..
ఏబీఎన్‌ న్యూస్‌ రీడర్‌ వెంకట కృష్ణ.. నిత్యం పార్టీల నేతలతో వివిధ అంశాలపై డిబేట్‌లు నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా డిబేట్‌కు వచ్చే వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తూ శునకానందం పొందుతాడు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావును కూడా డిబేట్‌కు ఆహ్వానించాడు. అయితే లైవ్‌ ప్రోగ్రాంలో ఆయనను అవమానించేలా గెట్‌ ఔట్‌ ఫ్రం మై షో అంటూ దురుసుగా పలుమార్లు అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నాయకులపట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన వెంకట కృష్ణ తీరుపై నెటిజన్లు మిగతా మీడియా ప్రతినిదులు కూడా మండిపడుతున్నారు.

ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు..
మీడియాకు సాధారణంగా ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు. రాజ్యాంగం ఏమీ కల్పించలేదు. కానీ వెంకట కృష్ణలాంటి కొందరు తామేదో డిక్టేటర్లం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దురుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చానల్‌ యాజమాన్యం కూడా అభాసుపాలవుతోంది. వెంకటక కృష్ణ ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అనేక మందితో దురుసుగా మాట్లాడారు. గౌరవం లేకుండా సంబోదించడం చేశాడు.

ఏబీఎన్‌ ఏం చేయాలి.?
ఏపీలో వైసీపీ, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఏబీఎన్‌ను బాయ్‌కాట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ చానల్‌ అధికార పార్టీ నేతలతోనే ఇక డిబేట్‌ నిర్వహించుకోవాలి. ప్రతిపక్షం ఉంటే డిబేట్‌ అర్థవంతంగా ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏబీఎన్‌ యాజమాన్యం తెలంగాణ ఉద్యమకారుడు తక్కెళ్లపల్లికి క్షమాపణ చెప్పి క్రెడిబులిటీని నిలబెట్టుకోవడం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular