https://oktelugu.com/

Allu Arjun: పుష్ప 2 కోసం తగ్గేశాడు.. పవన్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతల వెనుక కథ

గత కొద్ది రోజులుగా రెండు కుటుంబాల మధ్య వివాదానికి చెక్ పడింది. వివాదానికి కారణమైన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 3, 2024 / 10:47 AM IST

    Allu Arjun(16)

    Follow us on

    Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానిది ప్రత్యేక స్థానం.మెగాస్టార్ చిరంజీవి మకుటం లేని మహారాజులా ఎదిగారు. ఆయన కాంపౌండ్ వాల్ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. అయితే ఇప్పటివరకు మెగా కుటుంబంలో ఎటువంటి అరమరికలు ఉండేవి కావు. కానీ ఎన్నికల ముంగిట జరిగిన పరిణామాలతో ఆ కుటుంబంలో విభేదాలు వచ్చాయి. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో చిన్నపాటి వివాదం ప్రారంభం అయ్యింది. అయితే ఎక్కడా నేరుగా విభేదాలు లేకపోయినా.. అభిమానుల మధ్య మాత్రం అడ్డగోలు చీలిక ఏర్పడింది. అయితే గత కొద్ది నెలలుగా జరిగిన ఈ పరిణామాలకు బ్రేక్ చెప్పారు అల్లు అర్జున్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆ వివాదం ముగిసినట్లు అయ్యింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం ఈనెల 5న విడుదల కానుంది.ఆ సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. టికెట్ పెంపును ఆమోదించినందుకు ఏపీ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఇటువంటి నిర్ణయాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పారు. ప్రభుత్వ నిబద్ధతను కొనియాడారు.ఏపీ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు అల్లు అర్జున్. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వివాదానికి తెరపడినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.

    * ప్రత్యేక ఇమేజ్ తో
    వాస్తవానికి అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అర్జున్ తెరపైకి రాలేదు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం చిరంజీవి విషయంలో చాలా గౌరవ మర్యాదలతో మెలిగేవారు. చాలా ఐక్యతగా ముందుకు సాగేవారు. అయితే ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి కాదని ఓవైసీపీ అభ్యర్థి విషయంలో మద్దతు పలికారు అల్లు అర్జున్.ఇది మెగా అభిమానులకు మింగుడు పడలేదు. అలాగని ఆ కుటుంబంలో ఎక్కడా విభేదాలు బయటపడలేదు. అయితే ఇప్పటివరకు మెగా అభిమానులు, అల్లు అభిమానులు అంటూ వేర్వేరుగా ఉండేవారు కాదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసిపి అభ్యర్థికి మద్దతు ప్రకటించారో.. అక్కడి నుంచి వివాదం ప్రారంభం అయింది. పెను వివాదంగా మారింది. అభిమానులు అడ్డగోలుగా చీలిపోయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

    * సోషల్ మీడియా వేదికగా
    అయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం తారస్థాయికి చేరినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇరువురు అభిమానుల మధ్య యుద్ధం నడిచింది. నాగబాబు అల్లు అర్జున్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో జనసేన ఎమ్మెల్యేలు సైతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చారు. కామెంట్స్ కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం పుష్ప 2సినిమా విడుదలతో పాటు టికెట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలపడం, ఆయన పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడంతో వివాదానికి తెరపడినట్లు అయ్యింది.