https://oktelugu.com/

YS Jagan Mohan Reddy : జగన్ పై కేసు పెట్టిన బాబు సర్కార్.. జైలుకు పంపుతుందా?

 రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నడుస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ జగన్మోహన్ రెడ్డి పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Written By: , Updated On : February 20, 2025 / 12:47 PM IST
YS Jagan

YS Jagan

Follow us on

YS Jagan Mohan Reddy  : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) నేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఆయనతో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా.. పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో పర్యటించడంతోనే ఈ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనతో మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
 * 27న ఎమ్మెల్సీ ఎన్నిక
 గుంటూరు జిల్లాకు( Guntur district) సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈనెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో వైయస్ జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డులో రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రైతుల వద్దకు వెళుతున్న సమయంలో పోలీసుల భద్రత లేదు. దీంతో భారీ జన సందోహం మధ్య ఆయన రైతులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. తనకు భద్రత తగ్గించడానికి తప్పు పట్టారు. ప్రతిపక్ష నేతకు భద్రత ఇవ్వరా అని ప్రశ్నించారు. మీరు చేస్తున్నది కరెక్టేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. నిలదీసినంత ప్రయత్నం చేశారు. అయితే గుంటూరు మిర్చి యార్డులో జగన్ వ్యవహరించిన తీరుపై మంత్రులు, టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారు.
*  వైసీపీ నేతల ఆగ్రహం
 అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్( election code) అమలులో ఉన్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ జగన్తో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వరుసగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. రెండు రోజుల కిందట వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించేందుకు విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. జైలు బయట భారీగా జనాలు తరలివచ్చారు. వారిని చూసి జగన్ ఉత్తేజ ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలోనే టిడిపి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పై దృష్టి పెట్టిందని.. కేసులు నమోదు చేస్తోందని.. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఎటువంటి చర్యలకు దిగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కేసులతో ఇబ్బంది పెట్టేలా చూస్తుండడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.