https://oktelugu.com/

CM Chandrababu : చంద్రబాబును బెదిరిస్తున్న అధికారులు.. ప్రభుత్వమంటే అసలు భయం , భక్తి లేదే?

ఏపీలో చంద్రబాబు సర్కార్ పై కొందరు అధికారులు, కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా వైసీపీకి అనుకూల వ్యక్తిగా ముద్రపడిన ఉద్యోగ సంఘం నేత ఒకరు బాహటంగానే విమర్శలకు దిగారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 6, 2025 / 01:15 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu :  జగన్ చేసినప్పుడు ఒప్పు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పు అన్నట్టు ఉంది కొంతమంది ఉద్యోగ సంఘాల నేతల తీరు. వైసిపి హయాంలో ఆ పార్టీ కార్యకర్తల వ్యవహరించారు ఉద్యోగ సంఘాల నేతలు. అందర్నీ అదే గాటిలో కట్టలేము కానీ.. కొంతమంది వ్యవహార శైలి మాత్రం అభ్యంతరకరంగా ఉండేది. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అయితే వైసీపీ కార్యకర్తల వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీని తప్పుపట్టారు. వేకువ జామున పింఛన్లు పంపిణీ చేయకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? అంటూ మండిపడ్డారు వెంకట్రామిరెడ్డి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. పింఛన్లు అందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇంతకంటే దారుణం మరొకటి లేదని.. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే అదేనా? అని ప్రశ్నించి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పుకొచ్చారు.

    * ఆ హామీల మాటేంటి
    మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి. కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారని.. మరి ఈ నెలలో ఇస్తారా? మరో ఏడాది ఇస్తారా? అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి కానుకగా ఐఆర్ ఇవ్వాలని .. పెండింగ్ డీఎల్లో కనీసం ఒక్కటైనా ఇవ్వాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలన్నారు. భవిష్యత్తులో అలాంటివారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు వెంకట్రామిరెడ్డి. టిడిపి కార్యకర్తలు వస్తే టీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెట్టి పని చేసి పంపాలని మంత్రులనుంచి హెచ్చరికలు వస్తున్నాయని.. పనులు చేయకుంటే మీ సంగతి చూస్తామని హెచ్చరిస్తున్నారని.. సమావేశాల్లో కిందిస్థాయి అధికారులను తిడుతున్నారని కూడా మండిపడ్డారు వెంకట్రామిరెడ్డి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో సైతం వేధింపులకు గురిచేసారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చలేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 1000 మందిని తొలగించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది ఉద్యోగులకు షోకజ్ నోటీసులు జారీ చేశారని.. ఆదివారం నాడు కూడా పనులు చేయించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

    * గత ఐదేళ్లుగా ఇలా మాట్లాడలే
    గత ఐదేళ్లలో వైసిపి హయాంలో ఒక్క ఉద్యోగ సంఘం నేత కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. వెంకట్రామిరెడ్డి లాంటి నేత అయితే చాలా సానుకూలంగా ఉండేవారు. ఇప్పుడు అదే ఉద్యోగ సంఘం నేత కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడడం ఆందోళన కలిగిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాటలు చూస్తుంటే తిరుగుబాటు ధోరణితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీకి అనుకూలమైన ఉద్యోగ సంఘ నేతగా వెంకట్రామిరెడ్డి పై విమర్శ ఉంది. ఇప్పుడు కూడా వైసీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే కూటమి ప్రభుత్వంపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంకట్రామిరెడ్డి పై ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగుతుందో చూడాలి.