Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో సినీ పరిశ్రమ సైలెంట్.. కారణం అదే

AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో సినీ పరిశ్రమ సైలెంట్.. కారణం అదే

AP Elections 2024: వైసిపి సినీ పరిశ్రమకు దూరం పెట్టడానికి కారణం ఏంటి? ఆ వర్గం నుంచి ఒకరికి టికెట్ ఇవ్వకపోవడం దేనికి సంకేతం? సినీ పరిశ్రమ పవన్ వెంట వెళ్తుంది అన్న అనుమానమా? లేకుంటే వారు నెగ్గలేరన్నభయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు టికెట్లు దక్కేవి. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పెద్దగా వారిని పరిగణలోకి తీసుకోలేదు. ఏ పార్టీ కూడా సినీనటులను బరిలో దింపలేదు. వైసీపీ నుంచి రోజా, టిడిపి నుంచి బాలకృష్ణ, జనసేన నుంచి పవన్ తప్పించి సినీ పరిశ్రమకు చెందిన ఒక్క వ్యక్తి పేరు కూడా ఎక్కడా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు వైసీపీకి అండగా నిలబడ్డారు. ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ హడావిడి కూడా లేదు. కనీసం ఎక్కడా స్పందించడం లేదు కూడా. దీంతో ఇది ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

గతంలో సినీ పరిశ్రమకు చెందిన వారిలో ఎక్కువమంది రాజకీయాల్లో కొనసాగే వారు. దాసరి నారాయణరావు, డి రామానాయుడు, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం, మురళీమోహన్, అంబికా కృష్ణ, కోట శ్రీనివాసరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజకీయాల్లో సైతం ఎంట్రీ ఇచ్చారు. కొందరు ఎంపీలుగా గెలుపొంది కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. అయితే ఎందుకో ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రాష్ట్ర విభజన ఒక కారణం అయితే.. సినిమా యాక్టర్లకు పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశాయి. ఈ కారణంగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయాల వైపు రావడం తగ్గించేశారు.

సినీ పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీకి అధినేతగా కొనసాగుతున్నారు. దీంతో చాలామంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న..పవన్ మాత్రం ప్రోత్సహించడం లేదన్న విమర్శ ఉంది. గత ఎన్నికల్లో జనసేన ఉన్న చాలా మంది సినీ పరిశ్రమ వ్యక్తులు వైసీపీకి సపోర్ట్ చేశారు. మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, విజయ్ చందర్, భానుచందర్ ఇలా చాలామంది వైసీపీకి బాహటంగానే మద్దతు తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉండడం, సినీ పరిశ్రమ హైదరాబాదులో కొనసాగుతుండడం వంటి కారణాలతోవారంతా వైసీపీ వైపు ఆసక్తి చూపారు.ఈ ఎన్నికల్లో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు వస్తే సినీ గ్లామర్ తో హంగామా నడవాలి. కానీ ఈ ఎన్నికల్లో అటువంటిదేమీ కనిపించడం లేదు. ఏపీ రాజకీయాలంటేనే సినీ పరిశ్రమ వ్యక్తులు ఆసక్తి చూపడం లేదు. అయితే కొందరు తెర వెనుక మాత్రం సాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version