Temples
Temples: హిందూ ఆలయాలు దేశంలో ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నాయి. రాష్ట్రాల ప్రభుత్వాలే ఆలయాల నిర్వహణను చూసుకుంటున్నాయి. ఆలయానికి వచ్చే ఆదాయం ఆధారంగా ప్రభుత్వాలు తమ పరిధిలోకి తీసుకుంటున్నాయి. ఏటా పండుగలు, పబ్బాలు, పూజలు, పునస్కారాల పేరిట ఆలయాలకు వచ్చే భక్తులు పెరుగుతున్నారు. దీంతో ఆలయాలకు ఆదాయం పెరుగుతోంది. ఆలయాల ఆదాయం పాలకులకు వరంగా మారింది. నిర్వహణ పేరుతో ఆలయాల సొమ్మును ప్రభుత్వాలే తీసుకుని నిర్వహణను చూస్తున్నాయి. ఈ క్రమంలో చర్చిలు, మసీదులపై పెత్తనం లేని నేపథ్యంలో హిందూ ఆలయాలపై ఎందుకు ఉండాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో హైందర శంకారాం పూరించింది. హిందూ ఆలయాను ప్రభుత్వాలు చేతిలో పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తోందని భక్తులే ఆరోపిస్తున్నారు.
సనాతన ధర్మం పేరుతో…
హిందూ ఆలయాలు సనాతన ధర్మంలో భాగంగా పాలకులకు ఆదాయం సమకూర్చే వనరులుగా మారాయి. తెలంగాణలో యాదాద్రి, ఏపీలో తిరుమల ద్వారా ప్రభుత్వాలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. అందుకే అప్పట్ల కేటీఆర్ యాదాద్రి నిర్మాణానికి చేసిన ఖర్చును భవిష్యత్ పెట్టుబడితో పోచ్చారు. ఇలాంటి పరిస్థితిలో ఆలయాలన కూడా పాలకుల కబంధ హస్తాల నుంచి విడిపించాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అంశాన్ని తెరపైకి తెచ్చారు. అనేక హిందూ సంఘాలు కూడా ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలంటున్నారు. ఈ క్రమంలోఏ ఏపీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరుతో సభ నిర్వహించింది. ఇందులో కూడా సాధువుల, భక్తులు, వక్తలు ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు.
పాలకులు వదులు కుంటారా..
ఆలయాలు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిన ప్రస్తుత తరుణంలో స్వయం ప్రతిపత్తి డిమాండ్ ఊపందుకుంటోంది. సభలు, సమావేశాలతోపాటు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే ఆలయాకు ఆదాయం దృష్టిలో ఉంచుకుని పాలకులు స్వయం ప్రతిపత్తి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే ఇప్పటికిప్పుడు స్వయంప్రతిపత్తి రాకపోయినా.. పోరాటాల ఫలితంగా భవిష్యత్‌లో పోటాటం ఫలిస్తుందన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతంది. పోరాడితే పోయేదేం లేదు.. ఆలయాలకు విముక్తి తప్ప అన్న సంకల్పంతో హైందవ సంఘాలు ముందుకు సాగుతున్నాయి. హిందువులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.