Makar Sankranti : సంక్రాంతి ( Pongal)ఈ మాట అంటేనే గుర్తుకొచ్చేది.. తెలుగు ప్రజలు. అయితే తెలంగాణ కంటే ఏపీలోనే ఈ పండగకు ఎనలేని క్రేజ్. అందునా ఏపీలో సంక్రాంతి అంటే ఆ ఫ్లేవర్ వేరు. ముఖ్యంగా కోడిపందాలు( Chicken Bets )భారీ స్థాయిలో జరుగుతాయి. అయితే ఈ పందాలు అందరూ జూదంలా భావిస్తారు. కానీ ఈ కోడిపందాలకు ఒక చరిత్ర ఉంది. వినోదంతో పాటు జూదం అని కొందరు భావిస్తారు కానీ.. ఇవి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకాని మరికొందరు చెబుతుంటారు. ఈ కోడిపందాల సంస్కృతి ఎప్పుడు ప్రారంభం అయ్యిందో చెప్పలేం కానీ.. సింధు లోయ నాగరికత కాలం నుంచి కోడిపందాలకు సంబంధించి ఆధారాలు లభించాయి. చైనా, పర్షియా తూర్పు దేశాల్లో కూడా కోడిపందాల సంస్కృతి అనాదిగా ఉన్నది. పోరాటానికి స్ఫూర్తినిస్తుంది కోడి. పౌరుషానికి ప్రతీక కూడా కోడిపందాలు నిలుస్తాయి. సినిమాల్లో చూపించిన దానికంటే కోడిపందాలు పౌరుషాన్ని రగుల్చుతాయి. అందుకే కోడిపందాలకు అంత క్రేజ్.
* అదో వినోద చర్య కోడిపందాలు( chicken bets ) చూడడం అనేది ఒక రకమైన వినోదం. గ్రామీణ ప్రాంతాల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంగా కోడిపందాలు నిర్వహించడం ఒక సాంప్రదాయంగా మారింది. కోడి పందాలపై పందెం వేయడం వల్ల చాలామందికి ఆర్థికంగా కలిసి వస్తుంది కూడా. అయితే కోడిపందాలు కాయడం కూడా ఒక విద్యగా పరిగణిస్తారు. ప్రధానంగా ఈ పందాలలో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఈ శాస్త్రం ప్రకారం కోడి రంగు, జాతి నక్షత్రం, సమయం మొదలైన వాటి ఆధారంగా పందెం గెలుపును అంచనా వేస్తారు.
* ఆర్మీ తరహాలో శిక్షణ
పందెం కోడికి శిక్షణ ఆర్మీ ( army training)తరహాలో ఉంటుంది. బలమైన ఆహారం పెడతారు. రోజు వ్యాయామం చేయిస్తారు. పందెం కోళ్లలో సైతం అనేక రకాలు ఉంటాయి. ప్రతి జాతికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కోడిపందాలకు సంబంధించిన ప్రత్యేక ఆచారాలు కూడా ఉంటాయి. అయితే కోడిపందాలు అనేవి క్రమేపి ఒక జూదంలా మారాయి. సమాజంలో మనుషులను విభజించాయి. అందుకే చాలా దేశాల్లో కోడిపందాలు నిషేధించారు. ఈ పందాలలో కోళ్లకు కలిగే హింస దృష్టిలో ఉంచుకొని.. పక్షుల సంరక్షణ చట్టాలకు లోబడి కోడి పందాలు నిషేధించిన దేశాలు కూడా ఉన్నాయి.
* పురాతనమైన సంస్కృతి
ఎంతో పురాతనమైనది కోడిపందాల సంస్కృతి( culture). అయినా సరే ప్రజలకు ఒక వ్యసనంలా మారింది. అయితే సాంస్కృతిక వారసత్వంగా ఇది వస్తోంది. కానీ బయట ప్రపంచానికి మాత్రం ఇదొక జూదవ్యవస్థలా మారింది. మన రాష్ట్రంలో గోదావరి, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీగా కోళ్ల పందాలు జరుగుతాయి. అయితే ఇది జూదంలా మారాయి అనడం అతిశయోక్తి కాదు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చి.. జూదంలా మారాయి. అందుకే ఏటా ప్రభుత్వాలు కోడిపందాల విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేస్తాయి కానీ. కోడిపందాలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతాయి.