https://oktelugu.com/

Andhra Pradesh : పండుగ పూట ఏపీకి గుడ్ న్యూస్.. భారీగా నిధులు.. ఎలా అంటే?

 సరిగ్గా సంక్రాంతి ( Pongal) పండుగ సమయంలో కేంద్రం తీపి కబురు చెప్పింది. చెప్పడమే కాదు ఏకంగా రూ.7000 కోట్ల నిధులను విడుదల చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 10, 2025 / 09:55 PM IST

    Tax share to AP.

    Follow us on

    Andhra Pradesh : ఏపీకి కేంద్రం( central government) గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ పూట భారీగా నిధులు విడుదల చేసింది. పన్నుల్లో వాటా కింద పలు రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది కేంద్రం. మొత్తం రూ. 1,73,030 కోట్లను కేంద్రం విడుదల చేయగా.. అందులో ఏపీకి రూ.7,002 కోట్లు దక్కాయి. తెలంగాణకు( Telangana state)  రూ. 3,637 కోట్లు విడుదల చేసింది కేంద్రం. అత్యధికంగా యూపీకి రూ.31 వేల కోట్ల నిధులు కేటాయించారు. ఆ తరువాత స్థానాల్లో బీహార్ తో పాటు పశ్చిమ బెంగాల్ ఉంది. వాటి తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఏపీకి అదనంగా నిధులు దక్కాయి. మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను కేటాయించారు. అయితే గత వార్షికంలో ఇచ్చిన దానికంటే ఇది అదనం.
     * అత్యధికంగా యూపీకి 
     సాధారణంగా అన్ని రకాల పన్నుల్లో( all taxes) రాష్ట్రానికి వాటా ఉంటుంది. ముఖ్యంగా జిఎస్టి( GST) వచ్చిన తర్వాత కూడా ఈ పన్నుల ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. కాకా ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అధికంగా నిధులు దక్కాయి. ఉత్తరప్రదేశ్ కు ఏకంగా  రూ. 31,039 కోట్లు విడుదల చేశారు. అటు తరువాత బీహార్ రాష్ట్రానికి రూ.17,403.36 కోట్లను విడుదల చేసింది కేంద్రం. పశ్చిమ బెంగాల్ కు రూ. 13,017 కోట్లు, మహారాష్ట్రకు రూ. 10,930.31 కోట్లు, రాజస్థాన్ కు రూ. 10,426.78 కోట్లు కేటాయించారు. మన పురుగున ఉన్న తమిళనాడుకు పన్నుల వాటా కింద రూ. 7057.89 కోట్లు విడుదల చేశారు. అటు తరువాత ఏపీకి ఏకంగా రూ.7002 కోట్లు దక్కడం విశేషం.
     * చిన్న రాష్ట్రాలకు ఇలా
     చిన్న రాష్ట్రాలకు( small states ) తక్కువ మొత్తంలో పన్నుల వాటా నిధులు రావడం విశేషం. గోవాకు రూ. 667.91 కోట్లు, సిక్కిం రాష్ట్రానికి రూ. 671.35 కోట్లు దక్కినట్లు కేంద్రం వెల్లడించింది. పన్ను వసూళ్లలో 41 శాతాన్ని రాష్ట్రాలకు వాటా కింద కేంద్రం విడుదల చేస్తుంది. అయితే 2017 నుంచి 20 మధ్యకాలంలో రాష్ట్రాలకు పన్నుల వాటా శాతం 42 గా ఉండేది. 2021 తర్వాత అందులో ఒక శాతం కోత విధించారు. ప్రస్తుతం 41 శాతం వాటాను మాత్రమే చెల్లిస్తున్నారు.
     * ప్రామాణికాలు ఇవే 
     రాష్ట్రాలకు పన్నుల వాటా ( taxes share ) చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రామాణికాలు పాటిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటుంది. దానికి 12.5% కేటాయిస్తుంది. అటు రాష్ట్రాలకు వచ్చే ఆదాయానికి 45%, జనాభాతో పాటు ప్రాంతానికి 15%, అటవీ 6భూమికి 10 శాతం, టాక్స్ అండ్ ఫిసికల్ ఎఫర్ట్స్ కు 2.5% వెయిటేజీ ఇస్తుంది. వీటినే రాష్ట్రాలకు పన్నుల వాటా కింద ప్రామాణికంగా తీసుకుంటుంది. భౌగోళికంగా పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కు ఎప్పుడు సింహభాగం వాటా దక్కుతుంది అందుకే.