https://oktelugu.com/

Gudlavalleru: ఆ యువతి నిర్వాకం వల్లే.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం వెనుక సంచలన నిజం వెలుగులోకి..

గుడివాడ సమీపంలో ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. విద్యార్థినుల వాష్ రూం లలో రాసి కెమెరాలను ఏర్పాటు చేసి.. వారి వీడియోలు చిత్రీకరించి..డార్క్ వెబ్ కు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఏకంగా 300 దాకా వీడియోలు రికార్డు చేశారని..వాష్ రూం లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది కూడా ఓ విద్యార్థిని అని

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 30, 2024 / 10:15 PM IST

    Gudlavalleru Engineering College

    Follow us on

    Gudlavalleru: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో.. యువతుల వాష్ రూమ్ లలో రహస్య కెమెరాల ఏర్పాటు వ్యవహారం సంచలనంగా మారింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కృష్ణాజిల్లాలోని అత్యంత ప్రముఖమైనది. కాలేజీ హాస్టల్ లో యువతుల బాత్ రూం లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారని కొంతమంది విద్యార్థినులు రాత్రిపూట ఆందోళనకు దిగారు.. ఓ విద్యార్థిపై అనుమానం వ్యక్తం చేశారు. అతనిపై ముకుమ్మడిగా దాడి చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    హాస్టల్ వద్దకు పోలీసులు

    విషయం తెలుసుకున్న పోలీసులు ఆ హాస్టల్ వద్దకు వచ్చారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. కృష్ణాజిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను సంఘటన స్థలానికి పంపించింది. వారు కింది స్థాయికి సిబ్బందితో కలిసి కళాశాల విద్యార్థినులతో మాట్లాడారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి కీలక విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు అదే హాస్టల్లో ఉంటున్న బీటెక్ ఫైనల్ విద్యార్థిని కారణం అని తెలుస్తోంది. ఆమె స్నేహితుడు బెదిరింపులకు గురి చేయడంతో భయపడి ఇలాంటి దారుణానికి పాల్పడిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ యువతి తండ్రి ఒక రాజకీయ నాయకుడని స్థానికులు చెబుతున్నారు.

    డార్క్ వెబ్ కు విక్రయం

    గుడివాడ సమీపంలో ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. విద్యార్థినుల వాష్ రూం లలో రాసి కెమెరాలను ఏర్పాటు చేసి.. వారి వీడియోలు చిత్రీకరించి..డార్క్ వెబ్ కు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఏకంగా 300 దాకా వీడియోలు రికార్డు చేశారని..వాష్ రూం లలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది కూడా ఓ విద్యార్థిని అని.. ఆమె అదే కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. తన స్నేహితుడి బెదిరింపులకు భయపడి ఆమె ఈ దారుణానికి పాల్పడిందని తెలుస్తోంది. చివరి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థిని.. అదే కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ప్రేమించింది. కొద్దిరోజుల క్రితం వారిద్దరు ఓయో రూమ్ కు వెళ్లారు. వారిద్దరూ ఏకాంతంగా గడిపారు. ఆదర్శాలను ఆమె స్నేహితుడు తన ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను తన స్నేహితులకు పంపించాడు. వారంతా ఆ వీడియోను చూపిస్తూ ఆ విద్యార్థినిని బెదిరించడం మొదలుపెట్టారు. తాము చెప్పినట్టు చేయాలని.. లేకపోతే ఆ వీడియోలను బయటికి విడుదల చేస్తామని హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో ఆమె తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడింది.. ఇలా కొంతకాలంగా ఆ విద్యార్థినుల వీడియోలను రికార్డు చేయడం.. ఆ తర్వాత వాటిని రోజువారీ మాదిరిగా డార్క్ వెబ్ కు ఆ విద్యార్థులు విక్రయిస్తున్నారని తెలిసింది.

    రెండు నెలల నుంచి గుట్టుగా..

    అయితే ఈ వ్యవహారం రెండు నెలల నుంచి గుట్టుగా సాగుతోంది. వారం క్రితం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని విద్యార్థినులు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆ యువతి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సమయంలో తన కుమార్తెకు బుద్ధి చెప్పాల్సిన అతను.. ఏకంగా ప్రిన్సిపాల్ మీదకే గరమయ్యాడు. తన కుమార్తె పేరు బయటకు వస్తే కళాశాల మీద మాదకద్రవ్యాల కేసు పెట్టించి మూసి వేయిస్తానని హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వాట్సప్ స్క్రీన్ మెసేజ్ షాట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    పోలీసుల అదుపులో విద్యార్థి

    రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటనలో చివరి సంవత్సరం చదువుతున్న అబ్బాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. అనుమానం ఉన్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం సక్రమంగా వ్యవహరించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.