AP Debt: ఏపీ సర్కార్ ఒక విషయంలో జాతీయ స్థాయిలో ముందంజలో ఉంది. అప్పు అంటేనే తెగ తాపత్రయ పడుతోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అప్పులు చేస్తోంది. చివరకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు కూడా పెట్టింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా అప్పు చేసింది. కార్పొరేషన్ల ద్వారా సైతం రుణాలు సేకరించింది. కేంద్రం ఇచ్చే రుణ పరిమితికి మించి అప్పులను వాడుకుంది. ఇప్పుడు చేసేదేమీ లేక అప్పుల కోసం రంధ్రాన్వేషణ చేస్తోంది. ఏకంగా నిధి యాప్ ను రూపొందించింది. అందులో ఏ ఆస్తులు తాకట్టులో లేవో నమోదు చేయాలని ఆదేశించింది. వాటిని సైతం తాకట్టు లో పెట్టి అప్పులు తీసుకోవాలని భావిస్తోంది. వారం రోజులుగా ఈ తంతు సాగుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017లో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను తీసుకొచ్చారు. దేశంలోనే అత్యుత్తమ చెల్లింపులు వ్యవస్థగా తీర్చిదిద్దారు. దీంతో కేంద్రం తో పాటు ఆర్బిఐ పలుమార్లు ఈ వ్యవస్థను అభినందించారు. అప్పటినుంచి ఎటువంటి చెల్లింపులు అయినా పారదర్శకంగా నమోదవుతూ వస్తున్నాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పక్కన పెట్టేశారు. హర్బ్ అనే కొత్త సాఫ్ట్ వేర్ తీసుకొచ్చారు. సాధారణంగా ముందు వచ్చిన బిల్లులకు ముందుగా చెల్లింపులు చేయాలి. దీనిని ఫిఫో అంటారు. దీనికోసమే సిఎఫ్ఎంఎస్ ను రూపొందించారు. ఒకవేళ ఈ ఫిఫో ఉల్లంఘన జరిగితే శాశ్వతంగా రికార్డు అవుతుంది. డిలీట్ చేయడానికి కూడా కుదరదు. అందుకే దానిని పక్కన పెట్టారు. హెర్బ్ అనే ఫీచర్ ని తీసుకొచ్చారు. అది కూడా ఫీల్ కావడంతో జావా బేస్ తో ఇప్పుడు నిధి అనే సాఫ్ట్ వేర్ ను తెరపైకి తెచ్చారు.
అయితే ప్రభుత్వం తాజాగా ఈ నిధి యాప్ లో వివరాలు పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేషన్ల ఆస్తులతో పాటు వాటి అప్పుల వివరాలు, ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీ ల వివరాలను పొందుపరచాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కార్పొరేషన్లు ఏనాడో ఆ చేతనం అయ్యాయి. వాటి ఆస్తులు కూడా తనకాల్లో ఉన్నాయి. ఆస్తులు లేని కార్పొరేషన్లకు ప్రభుత్వ సొమ్మును మళ్లించి మరి బినామీ అప్పులు తెచ్చారు. కానీ చాలావరకు కార్పొరేషన్లకు ఉన్న కొద్దిపాటి ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అయితే అప్పులు, ఆస్తులు వివరాలను మాత్రమే నిధి యాప్ లో నమోదు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం శాఖల వారీగా ఉన్న పెండింగ్ బిల్లుల వివరాలను మాత్రం అడగడం లేదు. వివిధ నిర్మాణాలకు సంబంధించి రెండు లక్షల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి చెల్లింపుల విషయంలో మాత్రం ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపు పై జగన్లో అనుమానం ఉంది. అస్మదీయ కాంట్రాక్టర్లకు వేలకోట్లు చెల్లించడానికి ఇ ప్పటికీ ఎన్నో అప్పులు తెచ్చారు. అవి ఏ మూలకు సరిపోవడం లేదు. అనేక పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం 20 వేల కోట్లు పథకాలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉంది. చేయూత పథకాన్ని నిలిపివేశారు. వీటన్నింటికీ డబ్బులు అవసరం. కేంద్రం అనుమతించిన పరిమితికి మించి రుణాలు చేశారు. ఇప్పుడు ఈ మూడు నెలలు కీలకం. సంక్షేమ పథకాల మాటల పంచడానికి డబ్బులు అవసరం. అందుకే ఈ తాకట్టు ప్రయత్నాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.