Homeఆంధ్రప్రదేశ్‌Jagan big mistake: జగన్ చేస్తున్న తప్పు అదే!

Jagan big mistake: జగన్ చేస్తున్న తప్పు అదే!

Jagan big mistake: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్వలేదు. 2019 నుంచి 2024 మధ్య గొప్పగా పాలించానని ఆయన భావిస్తున్నారు. అందులో తప్పులు వెతకలేం కానీ.. ప్రజలు ఆశించిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాలన అందించలేదు. అన్నింటికీ మించి ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వ్యవహరించలేదు. ఇప్పుడు దారుణ పరాజయం ఎదురైన తర్వాత కూడా ఆయనలో మార్పు రావడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో ఆయన చేస్తున్న ప్రకటనలపై విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దానిని అహంకారం అనుకోవాలో.. అవివేకం అనుకోవాలో తెలియడం లేదని చెబుతున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల హాజరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలోనే ఆయన మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. తనకు మాట్లాడే అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని.. అందుకే సభకు హాజరు కావడం వేస్ట్ అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సభకు వెళ్లకుండానే ఆయన ఆ నిర్ణయానికి రావడం విమర్శలకు తావిస్తోంది.

ఆ విషయం ప్రజలకు తెలుసు..
జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే ప్రతిపక్ష హోదా అంటున్నారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ( Telugu Desam Party)వచ్చిన సీట్లపై మాట్లాడారు. 2019లో టిడిపి ఓడిపోయిన తరువాత.. ఆ పార్టీ నుంచి ఓ నలుగురు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 23 స్థానాలతో ఉన్న టిడిపి బలం అప్పుడు 19 స్థానాలకు పడిపోయింది. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను లాగేస్తే.. టిడిపి బలం పడిపోతుందని.. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా పోతుందని.. ఇదే జగన్మోహన్ రెడ్డి సభా నాయకుడి హోదాలో ప్రకటన చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబును ఉద్దేశించి హేళనగా మాట్లాడారు. అంటే ప్రతిపక్ష హోదా నేత విషయంలో ఆయనకు ఒక అవగాహన ఉందని ప్రజలకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే పనిగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. సభకు వస్తానని చెప్పడాన్ని మాత్రం ప్రజలు ఎక్కువమంది తప్పు పడుతున్నారు.

ఆ అవకాశాన్ని వినియోగించుకోలేక..
శాసనసభకు( assembly sessions ) వస్తే సమయం ఇస్తామని స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ చెబుతున్నారు. కూటమి పార్టీల నుంచి జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బహుశా వారు రాజకీయ అవమానాలు చేయడానికి పిలిచి ఉండొచ్చు గాక.. కానీ జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లకుండా చెబుతున్న మాటలు మాత్రం సహేతుకంగా లేవు. ఒక ఎమ్మెల్యేగా నిమిషాలు మాత్రమే అవకాశం ఇస్తే తనకు కుదరదని చెబుతున్నారు. బయట ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే గంటల వ్యవధి పడుతుందని చెబుతున్నారు. అదే సభకు హాజరైతే నిమిషాలు మాత్రమే అవకాశమిస్తే ప్రజాసమస్యలు ఎలా ప్రస్తావిస్తానని ప్రశ్నిస్తున్నారు. అంటే తనకు ఆయుధం ఇవ్వండి యుద్ధం చేస్తాను అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. సభకు వెళ్లి ప్రజా సమస్యలు ప్రస్తావించిన తర్వాత.. ఉన్నప్పలంగా వారు మైక్ కట్ చేసినా.. లేకుంటే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అవహేళన చేసినా.. దానిని ప్రజలు గ్రహిస్తారు. ప్రజల్లో కూడా ఒక అయోమయం తొలగిపోతుంది. జగన్మోహన్ రెడ్డిని సభకు పిలిచింది అవమానించడానికి అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడం లేదు. ఎంతవరకు తనకు ప్రతిపక్ష.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరని మాత్రమే చెబుతున్నారు. తనకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని గ్రహించలేకపోతున్నారు. సభకు వెళ్లి అవమానించబడి.. నీకు నమస్కారం అంటూ సభ నుంచి నిష్క్రమిస్తే ప్రజలు నమ్ముతారు. కానీ అలాకాకుండా ఇంట్లో ఉండి.. ప్రెస్ మీట్లతో కాలం వెలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేస్తున్న తప్పిదానికి ఆయనే మూల్యం చెల్లించుకోక తప్పదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular