Thalliki Vandnam : దీనికి సంబంధించి మార్గదర్శకాలపై కూడా కసరత్తును మొదలుపెట్టింది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అమలుపైన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఈ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. అయితే వీటిని ఒక విడతలోనే అమలు చేస్తారా లేదా రెండు విడతలుగా అమలు చేస్తారా అని దాని మీద ఇంకా చర్చ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం తల్లికి వందనం పథకం అమలులో కొన్ని నిబంధనలు ఖరారు అయినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తల్లికి వందనం పై కసరత్తు మొదలు పెట్టింది. ఈ పథకంపై బడ్జెట్లో కూడా నిధులను కేటాయించడం జరిగింది.
Also Read : చంద్రబాబు మంచి నిర్ణయం!
ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15000 చొప్పున ఇస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కీలకము కానున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పలు సార్లు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పథకంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ పథకం అమలు చేస్తామని చెప్తూనే ఒక ఇన్స్టాల్ మెంటా లేదా రెండు విడతలుగా ఇవ్వనున్నారా అని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తల్లికి వందనం పథకంలో ఒకే విడతలో 15000 చెల్లిస్తారా లేదా రెండు విడతలుగా 7500 చొప్పున చెల్లించే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనే చర్చ మొదలైంది. తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య మరియు వాటికి కావాల్సిన నిధుల పైన కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే ఈ నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రిలీజ్ చేయాల్సి ఉండడంతో తల్లికి వందనం పథకంలో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది.