Homeఆంధ్రప్రదేశ్‌TDP MLA Controversial Comments: బ్లడీ బాస్టర్డ్.. గిరిజనులపై నోరు పారేసుకున్న టిడిపి ఎమ్మెల్యే.. వీడియో...

TDP MLA Controversial Comments: బ్లడీ బాస్టర్డ్.. గిరిజనులపై నోరు పారేసుకున్న టిడిపి ఎమ్మెల్యే.. వీడియో వైరల్

TDP MLA Controversial Comments: అధికార పార్టీ ఎమ్మెల్యేల దూకుడు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతోంది. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పక్షాలు సిద్ధంగా ఉన్న తరుణంలో.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులపై అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ నోరు పారేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది గిరిజన సంఘం ముసుగులో వైసిపి చేస్తున్న ప్రచారం అంటూ టిడిపి చెబుతోంది. కానీ గిరిజనుల అంశం కావడంతో ఇది రాజకీయంగా వైసీపీకి ప్రచారాస్త్రంగా మారింది.

* అసెంబ్లీలో ప్రస్తావన..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియా సామాజిక వర్గం ఉంది. దాదాపు 25 వేల మందికి పైగా జనాభా ఈ సామాజిక వర్గానిది.. సామాజిక రాజకీయపరంగా వెనుకబడి ఉంటారు. పక్కనే ఉన్న ఒడిస్సాలో వీరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే తమను ఎస్టీల్లో కలపాలని ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన బెంతు ఒరియాలు దశాబ్దాలుగా కోరుతూ వచ్చారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే కానీ.. వీరిని ఎస్టీ జాబితాలో కలిపిన సందర్భాలు లేవు. గత ప్రభుత్వాలు కమిషన్ల పేరుతో కాలం గడిపాయి. అప్పటినుంచి ఇది డిమాండ్ గానే మిగిలిపోయింది.

* సమస్యకు పరిష్కార మార్గం చూపాలని..
ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు అశోక్. ఈ తరుణంలో రాజకీయంగా పట్టు బిగించేందుకు అపరిస్కృత సమస్యలపై దృష్టి పెట్టారు. అలా బెంతు ఒరియాల విషయంలో న్యాయం చేయాలని ఆయన అసెంబ్లీలో విన్నవించారు. తన నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం వారు పడుతున్న బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలిపితే తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సమస్యను విన్నవించేందుకు ఎమ్మెల్యే అశోక్ వద్దకు గిరిజన సంఘాల ప్రతినిధులు వెళ్లారు. అయితే అశోక్ సావధానంగా వారికి సమాధానం చెబుతున్న తరుణంలో.. ఓ గిరిజన సంఘం నేత మాతో మాట మాత్రం సంప్రదించకుండా అసెంబ్లీలో బెంతు ఒరియా ల గురించి ఎలా ప్రస్తావిస్తారు అంటూ ప్రశ్నించడంతో అశోక్ ధీటుగా బదులిచ్చారు. అది తన నియోజకవర్గ సమస్య అని.. 25వేల మంది ప్రజల సమస్య అని.. అందుకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అశోక్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సదరు గిరిజన సంఘం నేత నిలదీసినంత పనిచేస్తూ ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అశోక్ ఫైర్ అయ్యారు. సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారని.. బ్లడీ బాస్టర్.. నువ్వు ఎవడివి రా నాకు చెప్పడానికి.. బుర్ర ఉందా అంటూ ఇలా వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత మిగతా గిరిజన సంఘం నేతలు అతనిని సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే అశోక్ ఒక ప్రతిపాదన పెట్టారు. గిరిజన సంఘం నేతలతో పాటు బెంతు ఒరియా సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని.. ఎవరి వాదనలు వారు వినిపించుకొని ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం చూద్దామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే అశోక్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అవుతుంది. అయితే దీని వెనుక వైసిపి ఉందని.. సదరు గిరిజన సంఘం నేత వైసిపి సానుభూతిపరుడు అని.. అటు బెంతు ఒరియాలను రెచ్చగొట్టి… ఇటు గిరిజన సంఘాలను ఎగదోసి వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోందని టిడిపి ఆరోపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version