TDP Internal Conflicts: ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా తలనొప్పిగా మారుతోంది. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా పెట్టని కోట. కానీ గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో టిడిపిలో ఒక రకమైన విభేదాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరే కారణం. మొన్నటివరకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావు అన్నట్టు నడిచింది వ్యవహారం. ఇంకోవైపు మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నట్టు ఉంది పరిస్థితి. మరోవైపు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని వ్యవహారం కూడా తీవ్ర దమారం రేపు తోంది. నిత్యం ఆయన సోదరుడు కేశినేని నాని సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే పరిస్థితి మాత్రం తెలుగుదేశం పార్టీలో అదుపుతప్పుతోందని అర్థం అవుతోంది.
* ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీనివాసరావుకు మంచి పేరు ఉండేది. విద్యావేత్త కూడా. సబ్జెక్టు పై స్పష్టమైన అవగాహన ఉంది. కానీ ఆయన దూకుడుగా ఉంటారు. చాలా ఆవేశంగా మాట్లాడతారు. ఈ అంశం పైన అయినా వేగంగా స్పందిస్తారు. ఈ క్రమంలోనే ఆయన అత్యంత వివాదాస్పదుడు అయ్యారు. సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో టీడీపీ హై కమాండ్ ఎంపీ కేసినేని చిన్నికి తిరువూరు బాధ్యతలు అప్పగించింది. అప్పటినుంచి అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్టు పరిస్థితి మారిపోయింది. కేశినేని చిన్ని పై ఎమ్మెల్యే శ్రీనివాసరావు నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే తిరువూరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు మాత్రం టిడిపి వెనుకడుగు వేస్తోంది.
* మైలవరంలో విభేదాలు..
మరోవైపు మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలో విభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు. అంతకుముందు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావు పై గెలిచారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ రాకతో దేవినేని ఉమామహేశ్వరరావు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ వర్గం దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాన్ని అణచివేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పటివరకు నామినేటెడ్ పదవి సైతం లభించలేదు. దీంతో ఆయన వర్గంలో సైతం తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే అక్కడ తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి.
* కేశినేని సోదరులతో హీట్..
మరోవైపు కేశినేని సోదరులు ఇద్దరు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హీటెక్కిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బై చెప్పారు కేసినేని నాని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయారు. అంతకుముందు రెండు ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన నాని పదేళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అయితే టిడిపి నాయకత్వం పట్ల మంచి భావం ఉన్న స్థానిక పరిస్థితుల వల్ల ఆయన వైసీపీలోకి జంప్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి కారణం తన సోదరుడు చిన్ని అని రగిలిపోతున్నారు నాని. అందుకే టిడిపి నాయకత్వానికి దగ్గరయ్యే క్రమంలో సోదరుడు చిన్ని పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే కృష్ణాజిల్లాలో జరుగుతున్న ఈ విభేదాలను చెక్ పెట్టాల్సిన అవసరం నాయకత్వంపై ఉంది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే
