NTR- Kamma People: మామ చంద్రబాబు ఓ కమ్మ అగ్ర నేత.. వరుసకు అల్లుడైన జూ.ఎన్టీఆర్ ఆది నుంచి మామ గిల్లుడికి దూరంగానే ఉంటున్నారు. సాంతం వాడేస్తున్న చంద్రబాబు తీరుకు విసిగివేసారి దూరం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు విసురుతున్న చట్రంలో జూ.ఎన్టీఆర్ పావుగా మారడం లేదు.. అందుకే కమ్మోళ్లకు జూనియర్ ఎన్టీఆర్ సాంతం దూరమైపోయారట.. మామకు టిక్కెట్ ఇవ్వలేదనే టీడీపీపై కోపంగా ఇలా చేస్తున్నాడా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ జూ.ఎన్టీఆర్ కోపానికి కారణం ఏంటి? మమకు చంద్రబాబు ఎందుకు టికెట్ ఇవ్వలేదు.? ఆ కథాకమామిషూ ఏంటన్న దానిపై స్పెషల్ ఫోకస్.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ అంశాన్ని కార్నర్ చేసుకొని రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చివరకు పోస్టర్ల అస్త్రాన్ని తెరపైకి తెచ్చి ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తరువాత ఈ అంశం పక్కదారి పట్టింది. పేరు మార్చిన జగన్ కంటే ఇప్పుడు టీడీపీ శ్రేణులు, కమ్మ సామాజికవర్గం వారు తారక్ ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీనికి కారణం లేకపోలేదు. అసలు ఇష్యూపై జూనియర్ స్పందించకపోయినా పర్వాలేదు కానీ.. తాము వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ ను జూనియర్ మహా నేతతో పోల్చడాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అయితే దీనికి తారక్ హార్ట్ కోర్ అభిమానులు అదే స్థాయిలో స్పందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రంలో కులాభిమానం ఎక్కువగా ఉండే జాబితాలో కమ్మలే ముందుంటారు. వారికున్న కులాభిమానం ఇంకొకరిలో ఉండదన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. తమలో తాము కొట్టుకుంటారు తప్ప.. ఇతర కులాలతో రగడ వచ్చిందంటే ఒక్కటై పోతారన్న ప్రచారం ఉంది. కులం విషయంలో వారు రాజీపడరు. తమ వారికి కష్టం ఉందని తెలిస్తే వాలిపోతారు. చెయ్యి ఇచ్చి ముందుకు లేపుతారు. తమ కులస్థులైతే చాలూ మంచైనా.. చెడైనా ఇట్టే నిలబడతారు. అవసరమైతే కలబడతారు. కులం ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేవారిని ఇట్టే పక్కనపెడతారు. మెజార్టీ కమ్మ కులస్థుల్లో ఈ కుల భావన ఎక్కువగా ఉంటుందని వారితో స్నేహం చేసేవారే చెబుతున్నారు. ఏపీలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ తమది అన్నట్టు ఓన్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చాలాసార్లు పరాజయాలు ఎదురయ్యాయి కూడా. గత ఎన్నికల్లో జగన్ కమ్మకులంపై ఇతర సామాజికవర్గాల్లో ధ్వేషభావం నింపి సక్సెస్ అయ్యారు. అయితే తాజా ఎపిసోడ్ లో జూనియర్ స్పందన జగన్ కు అనుకూలంగా ఉందన్న భావన కమ్మ సామాజికవర్గీయుల్లో ఉంది. అయితే ఇంతకాలం హరికృష్ణ కుమారుడు కావడం వల్లే తమ వాడిగా భావించామని.. కానీ జూనియర్ విషయంలో తమకు కొన్నిడౌట్లు ఉన్నాయని సంచలన కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Also Read: Janasena Early Elections: ముందస్తు ఎన్నికలు వస్తే జనసేన గెలిచే స్థానాలు ఎన్ని..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్మ సామాజికవర్గీయుల ఆర్థిక, రాజకీయ మూలాలను జగన్ దెబ్బతీశారన్న ఆరోపణలున్నాయి. అటువంటి జగన్ కు రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా జూనియర్ వ్యవహరిస్తున్నారని కమ్మలు నమ్ముతున్నారు. కేవలం పిల్లకిచ్చిన మామ వైసీపీలో ఉండడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని భావిస్తున్నారు. కుటుంబ ఆదరణ లేని సమయంలో చంద్రబాబు చేరదీశారని.. తన సమీప బంధువల పిల్లను చూసి పెళ్లి చేయించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గుడివాడలో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న రావి వంశీయులను కాదని కొడాలి నానికి జూనియర్ చెప్పారని టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. గన్నవరంలో సీనియర్లకు కాదని వల్లభనేని వంశీకి పట్టుపట్టి మరీ టిక్కెట్ ఇప్పించడం వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు. ఇవన్నీ మరిచిపోయి పిల్లకిచ్చిన మామకు టిక్కెట్ ఇవ్వలేదన్న ఆక్రోషంతో జూనియర్ ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే.. అసలు జూనియర్ సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదని కొందరు కమ్మ సామాజికవర్గం వారు తేల్చిచెబుతున్నారు. అదే విషయాన్ని సోషల్ మీడియాతో పంచుకుంటున్నారు. 2009లో జూనియర్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఓటమి చవిచూసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జూనియర్ అవసరం లేకుండా టీడీపీ ఘన విజయం సాధించిందని చెబుతున్నారు. జూనియర్ తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని.. అతడికి అంత సీన్ లేదని తేల్చిచెబుతున్నారు. ఏనాడైతే ఎన్టీఆర్ ను వైఎస్సార్ తో పోల్చావో.. నాడే నువ్వు తమ వాడివి కాదంటూ జూనియర్ పై రుసరుసలాడుతున్నారు. ప్రస్తుతానికి జూనియర్ జగన్ ట్రాప్ లో పడ్డారని అనుమానిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను జూనియర్ కలవడం జగన్ ప్లానేనని చెప్పుకొస్తున్నారు. నాడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దీనిని నిజం చేస్తున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కమ్మ సామాజికవర్గం నుంచి బహిష్కరించారన్న రేంజ్ లో ఆ సామాజికవర్గీయులు విరుచుకుపడుతున్నారు.
Also Read: Ananya Panday: ఆ హీరోయిన్ కి కోటి ఇచ్చి బుక్ అయిన నిర్మాత !