Tammineni Sitaramమాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు(Tammineni Sitaram ) చిక్కులు తప్పేలా లేవు. ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం చవిచూశారు. టిడిపి అభ్యర్థి చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైతం పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో ఆమదాలవలస వైసిపి సమన్వయకర్తగా ద్వితీయ శ్రేణి నాయకుడిని తెచ్చారు. అప్పటినుంచి పొలిటికల్ గా కూడా సైలెంట్ గా ఉన్నారు తమ్మినేని. ఇటువంటి తరుణంలో పాత కేసు ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. స్పీకర్ గా ఉన్నప్పుడే నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో న్యాయవిద్యను అభ్యసించారన్న ఆరోపణ ఉంది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ చేసిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
Also Read : సనాతనం ఎఫెక్ట్ : ఇఫ్తార్ విందుకు పవన్ దూరం
* సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా.. ఆమదాలవలస( aamdala valasa ) నియోజకవర్గ నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు తమ్మినేని సీతారాం. 1983 నుంచి 1999 వరకు ఆయనకు తిరుగులేదు. కానీ 2004 ఎన్నికల నుంచి ఆయనకు ఇబ్బందులే ఇబ్బందులు. మధ్యలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరినా ఆయనకు విజయం దక్కలేదు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా టికెట్ ఇవ్వలేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. కుమారుడికి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ అది దక్కేలా లేకపోవడంతో సైలెంట్ అయ్యారు.
* డిగ్రీ ఉత్తీర్ణత లేదు
తమ్మినేని సీతారాం డిగ్రీ పాస్ కాలేదు. కానీ ఆయన స్పీకర్ గా( speaker) ఉన్నప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలంగాణ టిడిపి నేత నర్సిరెడ్డి.. తమ్మినేని విద్యార్హతలు ఏంటి? ఆయనకు లా ఎడ్మిషన్ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించే సరికి అసలు విషయం తెలిసింది. తమ్మినేని నాగర్ కర్నూలు స్టడీ సెంటర్ నుంచి డిగ్రీ చేశానని సర్టిఫికెట్ పెట్టారు. కానీ ఆ కాలేజీ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలు సేకరించి.. చివరికి ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని తేల్చారు. కానీ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం.. తెలంగాణలో స్నేహపూర్వ ప్రభుత్వం ఉండడంతో ఆ జోలికి పోదలుచుకోలేదు అధికారులు.
* తీవ్రమైన నేరం
సాధారణంగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు( degree fake certificate ) అత్యంత తీవ్రమైన నేరం. సాధారణంగా ఇలాంటివి బయటపడితే వెంటనే ఆయా యూనివర్సిటీలు, కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి. తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి ఆధారాలతో తమ్మినేని నకిలీ డిగ్రీలు బయటపెట్టింది. ఆపై ఆయన ప్రత్యర్థి నేరుగా ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణ సీరియస్ గా కొనసాగితే మాత్రం తమ్మినేని ఇబ్బందుల్లో ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : కొత్త రేషన్ కార్డుల పై బిగ్ అప్డేట్.. జారీ అప్పుడే!