Talliki Vandanam Scheme: ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ స్కీం డబ్బులు ఈ నెల 22 న వేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం , గత ఏడాది ప్రారంభించారు. గత ఏడాది రెండు విడతలుగా ఈ డబ్బులను విడుదల చేయగా, ఈ ఏడాది ఒకేసారి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. మొత్తం మీద ఈ పధకానికి 67,47,190 మంది విద్యార్థులు అర్హులు కాగా, 42,70,902 మంది తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానుంది. ఒక్కొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో 13 వేల రూపాయిలు జమ కానుంది. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 10,120 కోట్ల రూపాయిలను విడుదల చేయబోతున్నట్టు సమాచారం.
ఈ పధకం ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ అకౌంట్ లో జమ కావాలంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యి ఉండాలి. అంతే కాకుండా , ఆ బ్యాంక్ ఖాతా యాక్టీవ్ గా ఉండాలి. ఈ రెండు లేకపోతే , అర్హులు అయ్యినప్పటికీ డబ్బులు కోల్పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ డబ్బులు జమ కాకపోతే , సమీపం లో ఉన్న సచివాలయాన్ని సందర్సించాలి. ఒక కుటుంబం లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే , అంతమందికి 13 వేలు జమ అవుతాయి. ఉదాహరణకు మీ కుటుంబం లో 5 మంది స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే , 65 వేల రూపాయిలు వస్తాయి అన్నమాట. గతం లో వైసీపీ ప్రభుత్వం ఇదే తరహా ‘అమ్మ వడి’ కార్యక్రమాన్ని చేపట్టి, కుటుంబం లో కేవలం ఒక్కరికి మాత్రమే డబ్బులు జమ చేసేది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి డబ్బులు జమ చేస్తోంది. ఈ పధకం కూటమి పార్టీ పై విపరీతమైన పాజిటివిటీ ని క్రియేట్ చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
