Homeఆంధ్రప్రదేశ్‌Sujana Chowdary: సుజనా చౌదరికి ప్రమోషన్ తప్పదా?

Sujana Chowdary: సుజనా చౌదరికి ప్రమోషన్ తప్పదా?

Sujana Chowdary: మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ( Vijayawada West ) నియోజకవర్గం నుంచి గెలిచారు సుజనా చౌదరి. అంతకుముందు ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆపై కేంద్ర మంత్రి అయ్యారు. అయితే రాజ్యసభ పదవిలో ఉండగానే బిజెపిలో చేరారు. పొత్తులో భాగంగా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు చాన్స్ దొరకలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని కూడా ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పై ఫుల్ ఫోకస్ పెట్టారు. నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అందులో ప్రథమ స్థానంలో నిలిచారు సుజనా చౌదరి.

* శరవేగంగా అభివృద్ధి..
వాస్తవానికి మంత్రి పదవి దక్కక సుజనా చౌదరి ( Sujana Chaudhari )తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని కూడా టాక్ నడిచింది. ముఖ్యంగా విజయవాడకు వరదలు వచ్చే సమయంలో సైతం ఆయన అందుబాటులో లేరని వ్యతిరేక మీడియాలో ప్రచారం నడిచింది. అయితే రెట్టింపు ఉత్సాహంతో ఆయన పని చేస్తున్నట్లు ఇప్పుడు ర్యాంకింగ్తో అర్థమవుతుంది. ముఖ్యంగా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఇటీవల మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ర్యాంకింగ్ రావడం విశేషం. అయితే ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి గణనీయంగా జరుగుతోందని స్థానికులు సైతం చెబుతున్నారు.

* వ్యతిరేక మీడియా ప్రచారం..
మరోవైపు సుజనా చౌదరికి మొదటి ర్యాంకు రావడాన్ని సహించుకోలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. ఆపై దాని అనుకూల మీడియా. ఇదంతా చంద్రబాబు మార్క్ ఫార్ములా అంటూ తేల్చి చెబుతోంది. తొలుత ఏదో ఒక రూపంలో ర్యాంకింగ్స్ ఇస్తారని.. అలా ప్రమోట్ చేసి సుజనా చౌదరికి మంత్రి పదవి కట్టబెడతారన్నది ఆ మీడియా వాదన. త్వరలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలోనే సుజనా చౌదరికి ఛాన్స్ ఇచ్చేందుకు ఈ ర్యాంకింగ్స్ తెచ్చారన్నది వ్యతిరేక మీడియా ప్రచారం. ఎప్పటికప్పుడు మంత్రి మండలి సమావేశాలు, మంత్రులు, శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో రివ్యూలు జరిపి.. ఈ ర్యాంకింగ్ పారదర్శకంగా ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం వ్యతిరేక ప్రచారం చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజాలు ఉన్నాయో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular