CM Jagan : ఫ్లాష్ ఫ్లాష్ : సీఎం జగన్ పై రాయితో దాడి.. కంటికి తీవ్ర గాయం.. పరిస్థితేంటంటే?

ముఖ్యమంత్రిపై ఈ ఘటన జరిగిన అనంతరం పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడ సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ ఘటన మీదగా ఎవరు అయితే ఈ ఘటన మీద ఎవరు ఉన్నారనేది అంతుపట్టడం లేదు. ఇది టిడిపి నాయకుల పనే అని వైసిపి నాయకులు అంటున్నారు.. గత ఎన్నికల్లోనూ ఇలాగే జగన్ పై కత్తితో దాడి చేశారని గుర్తు చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 13, 2024 9:56 pm

Stone attack on CM Jagan

Follow us on

CM Jagan :  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఆయన కనుబొమ్మకు గాయమైంది. దీంతో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కలకలం నెలకొంది. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది . మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర చేశారు.. విజయవాడలోని సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్ వద్ద బస్సు పైనుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడంతో అది అత్యంత వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో సీఎం కనుబొమ్మకు గాయమైంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై క్యాట్ బాల్ తో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ పక్కన ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి కూడా గాయమైనట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైద్యులు బస్సులో ప్రధమ చికిత్స అందించారు. ప్రధమ చికిత్స తర్వాత ముఖ్యమంత్రి బస్సు యాత్ర కొనసాగించారు. విజయవాడలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో జనం భారీగా వచ్చినట్టు వైసిపి నాయకులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో మూడున్నర గంటలుగా జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు.. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న యాత్రకు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి తట్టుకోలేక టిడిపి నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఆగంతుకులు రాయి విసిరిన నేపథ్యంలో జగన్ కంటి దగ్గర వాపు వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ జగన్ ససే మీరా అన్నారు. “ఇంతమంది జనం నాకోసం ఈ రాత్రిపూట వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతే బాగుండదు. అది సరైంది కూడా కాదు. జనం అంతా చూస్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు. ఏదైనా అయితే జనం చూసుకుంటారు. నేనైతే ఈ సభలో పాల్గొనాల్సిందే” అని జగన్ అనడంతో వైద్యులు సైలెంట్ అయిపోయారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బస్సు పైనుంచి అభివాదం చేశారు. విజయవాడ సింగ్ నగర్ వద్దకు రాగానే భారీ జన సందోహం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు జగన్ పై రాళ్లు విసిరారు.

ముఖ్యమంత్రిపై ఈ ఘటన జరిగిన అనంతరం పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడ సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ ఘటన ఎవరున్నారనేది అంతుపట్టడం లేదు. ఇది టిడిపి నాయకుల పనే అని వైసిపి నాయకులు అంటున్నారు.. గత ఎన్నికల్లోనూ ఇలాగే జగన్ పై కత్తితో దాడి చేశారని గుర్తు చేస్తున్నారు.