Srikakulam Fish Hunting Viral Video: సాధారణంగా చేపల వేట అనేది మత్స్యకారులు చేస్తుంటారు. ఎందుకంటే అది వారికి కులవృత్తి. ఇతర వృత్తుల వారికి వారి వృత్తిపై ఎంత అంకితభావం ఉంటుందో.. చేపల వేట పై మత్స్యకారులకు అంతే. అయితే చేపల వేట అనేది అంత సులువు కాదు. ఎందుకంటే సముద్రం అలలపై.. నదుల ప్రవాహం పై పెద్ద యజ్ఞం చేయాలి. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు చేపల వేట కూడా ఒక అలవాటైన విద్య. చెరువులు, కాలువల్లో చేపలు పట్టడం అనేది వారికి ఒక హాబీ లాంటిదే అని చెప్పవచ్చు. అయితే అదో క్రమశిక్షణ చేపల వేటగానే పరిగణించవచ్చు. అటువంటి దృశ్యమే శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామంలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
* కొన్ని రకాల పరికరాలతో..
చేపల వేటకు గాను గ్రామీణ ప్రాంత ప్రజలు కొన్ని రకాల పరికరాలను సిద్ధంగా ఉంచుకుంటారు. గాలం వేసి కొందరు.. వలవేసి మరికొందరు చేపల వేట సాగిస్తుంటారు. మరికొందరైతే వెదురు బొంగు తో.. చేపలను ఒడిసిపట్టే ఒక రకమైన పరికరాలను ఉంచుతారు. దానిని శ్రీకాకుళం పరిభాషలో ఊజీ అంటారు. ఏడాది పొడవునా చెరువులు, కాలువలు సాగునీటిని అందిస్తుంటాయి. ఖరీఫ్ ముంగిట అంటే.. వేసవిలో మాత్రం అవి కాళీ అవుతుంటాయి. ఖాళీ అయిన క్రమంలో ఏడాది పొడవునా వాటిలో పెరిగే చేపలను తమదైన రీతిలో వేటసాగించి.. కుటుంబంతో సంతృప్తిగా ఆరగిస్తారు గ్రామీణ ప్రాంత ప్రజలు.
* గ్రామస్తులంతా ఐక్యంగా..
గ్రామీణ ప్రాంతాల్లో చేపల వేట అనేది ఒక సంప్రదాయమైన తంతు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ముందుగా చాటింపు వేస్తారు. గ్రామ దండోరా తో గ్రామస్తులకు తెలియజేస్తారు. అది కూడా ఆదివారం, మంగళవారానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే అవి మాంసాహార రోజులు. అలా గ్రామ పెద్దలు పలానా రోజు చేపల వేట సాగిద్దాం అంటూ నిర్ణయిస్తారు. గ్రామ దండోరా ద్వారా తెలియజేస్తారు. అయితే ఎవరికివారుగా చెరువులు, కాలువల్లో దిగడం జరగదు. గ్రామస్తులంతా ఒకచోటకు చేరిన తరువాత చేపల వేటకు అవకాశం ఇస్తారు. అయితే ఇదో సంప్రదాయ చేపల వేట కాగా.. ఇలా వేటకు దిగిన ప్రతి ఒక్కరి చేతికి చాపల చిక్కుతాయి. ఒకవేళ ఎవరికైనా దొరకకపోతే.. ఎక్కువగా దొరికిన వారు తక్కువ దొరికిన వారికి ఇస్తుంటారు. ఇదో గ్రామ ఐక్య సౌందర్యం గా నిలుస్తుందనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే ఈ చేపల వేటలో కుటుంబమంతా పాల్గొంటుంది. ఇలా దొరికిన చేపలను తమ బంధువులకు, స్నేహితులకు పంపించి సంతృప్తి పొందుతుంటారు. నిజంగా ఈ చేపల వేట ఎన్నో సంతోషాలకు మేళవింపు.
ఈ వీడియో కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి
https://www.facebook.com/reel/1555506366074875
