Sri Reddy : చంద్రబాబు , పవన్ కు సారీ.. ఇన్నాళ్లు ఇష్టం వచ్చినట్టు వాగిన శ్రీ రెడ్డి దెబ్బకు దిగొచ్చింది.. వైరల్ వీడియో

వివాదాస్పద నటి, యూట్యూబర్, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి. జగన్‌ సీఎంగా ఉన్నంతకాలం సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ, జనసేన నేతలపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. తాజాగా కూటమి సర్కార్‌ చ్చిన షాక్‌తో దిగొచ్చింది.

Written By: Raj Shekar, Updated On : November 9, 2024 8:41 am

sri reddy

Follow us on

Sri Reddy : ఏపీ రాజకీయాల్లో వైసీపీకి చిన్నా చితక నటీ నటులు తప్పితే పెద్దాగా ఇండస్ట్రీ నుంచి మద్దతు లేదు. ఉన్న ఆ చిన్నా చితక నటులు కూడా రాజకీయ పరిణతి లేని నేతలే. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరు. 2019 నుంచి 2014 వరకు వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో సర్కార్‌ అండతో చెలరేగిపోయింది. తన యూట్యూబ్‌ వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేషన, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుతోపాటు వారి కుటుంబ సభ్యులను చీల్చ చెండాడింది. చెప్పరాని, రాయలేని భాషతో బూతు పురాణం వల్లించింది. తాజాగా జగన్‌ చెల్లి షర్మిలనూ దుర్భాషలాడుతూ వీడియోలు రిలీజ్‌ చేసేది. జగన్‌ను ఎవరు ఏమన్నా.. వారిపై తన తిట్ల దండకం అందుకునేది. ఆమో నోటికి భయపడి కొందరు.. ఆమెను ఏమైనా అంటే.. అధికార వైసీపీ కేసులు పెడుతుందేమో అని మరికొందరు.. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసే, బీజేపీ కూటమి.. ఇప్పుడు షోషల్‌ టెర్రర్‌పై ఉక్కుపాదం మోపుతోంది. కేసులు, అరెస్టులతో హడలెత్తిస్తోంది. ఈ దెబ్బకు ఇంతకాలం రెచ్చిపోయిన శ్రీరెడ్డి దిగొచ్చింది. గతంలో వపన్‌ కల్యాణ్, లోకేషన్, చంద్రబాబు, జనసేన, టీడీపీ నేతలను దూషించినందుకు క్షమాపణ కోరింది. ఈమేరకు వీడియో రిలీజ్‌ చేసింది.

అన్యాయం జరిగిందని..
సినిమా ఇండస్ట్రీలో తనకు అన్యాయం జరిగిందని, తనను శారీరకంగా వాడుకుని అవకాశాలు ఇవ్వలేదని ఫిలిం చాంబర్‌ ఎదుట అర్ధనగ్న ప్రదర్శనతో హైలెట్‌ అయింది. శ్రీరెడ్డి. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ, పవన్‌ కల్యాణ్‌ తల్లిని దుర్భాషలాడింది. ఆ విషయం అప్పట్ల తీవ్ర సంచలనం రేపింది. దీంతో శ్రీరెడ్డిపై అనధికార బహిష్కరణ వేశారు. దీంతో శ్రీరెడ్డి తన మకాం.. చెన్నైకి మార్చింది. యూట్యూబర్‌గా అవతారం ఎత్తింది. టీడీపీ, జనసేన నేతలపై దారుణంగా తిడుతూ వీడియోలు చేసింది. లోకేష్, ఆయన తల్లి, భార్యను కూడా వదిలిపెట్టలేదు. పవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుపై అయితే తీవ్ర పదజాలంతో వీడియోలు చేసేది.

గత ప్రభుత్వం అండతోనే..
గత వైసీపీ ప్రభుత్వం అండతోనే వీడియోలు రిలీజ్‌ చేసిన, తీవ్రంగా దుర్భాషలాడిన వైసీపీ సానుభూతిపరులు, సోషల్‌మీడియా నాయకులు, కార్యకర్తలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ టార్గెట్‌చేసింది. నోటీసులు ఇస్తుండడం, అరెస్టులు చేస్తుండడంతో శ్రీరెడ్డికి భయం పుచ్చుకుంది. వెంటనే శ్రీరెడ్డి ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. తామంతా నేతల చేతుల్లో పావులం.. మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే నేతలపై తీసుకోండి. కార్యకర్తలను వదిలేయండి అని ఆ వీడియోలో బతిమాలుకుంది.

అందరికీ క్షమాపణ..
ఇక గతంలో తాను మాట్లాడిన మాటలకు లోకేషన్‌గారు సారీ. మీ అమ్మగారికి సారీ, మీ భార్యకు సారీ, అలాగే హోం మంత్రి అనిత గారికిసారీ, పవన్‌కల్యాణ్‌గారికి సారీ. మీ కుటుంబ సభ్యులకు సారీ, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నాకంటూ భవిష్యత్‌ ఏమీ లేదనుకోండి.. నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా’ అని శ్రీరెడ్డి వేడుకుంది. ఇక నుంచి తన సోషల్‌ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా కానీ,ఏ విధంగా కానీ తప్పుడుగా మాట్లాడనని తెలిపింది. మీ చర్యలు కార్యకర్తలపై కాకుండా లీడర్స్‌ మధ్య జరిగేలా చూసుకోండి అని కోరింది. ఇదే నా విన్నపం.. తల వంచి నమస్కరిస్తున్నా అని కోరింది. నన్ను నా కార్యకర్తలను వదిలిపెట్టండని, నన్ను క్షమించండి అని వీడియో ముగించింది.