Software Engineer One Sided Love : ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ ఎప్పుడో ఓ కవి చాలా వేధనాభరితంగా వర్ణించాడు. ప్రేమిస్తున్నానని అబ్బాయి వెంటపడడం.. అమ్మాయిలు తిరస్కరించడం సహజం.. అక్కడితో ఆగిపోయి అబ్బాయిలు వేరే తోడును వెతుక్కుంటారు. కానీ ఇక్కడ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన సహోద్యోగి అయిన యువతిని పెళ్లికి నిరాకరించినందుకు కడతేర్చాడు. ఇతడిని ముందుగా ప్రేమించి అనంతరం దూరం పెట్టడంతో బంగారం లాంటి ఓ యువ టెక్కీ జీవితాన్ని ముగించినట్టైంది.
ఆంధ్రా యువ టెక్కీ తన మాజీ సహోద్యోగి చేతుల్లో అసువులు బాసింది. తోటి సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని తుపాకీతో కాల్చి తన ప్రేమను కాదన్నందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. అనంతరం తనూ కాల్చుకొని చచ్చాడు. ఈ విషాద ఘటన ఏపీలో అందరినీ కంటతడిపెట్టించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సోమవారం ఓ కఠిన ప్రేమికుడు తనను పెళ్లి చేసుకోవడం లేదని ఓ తోటి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను కాల్చి చంపాడు. ఈ ఘటన పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది.
ఎం.సురేష్ రెడ్డి (30) అనే వ్యక్తి కావ్యారెడ్డి (24)ని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనను తాను కాల్చుకొని జీవితాన్ని ముగించుకున్నాడు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కాగా.. గతంలో బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో కలిసి పనిచేశారు.
సురేశ్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. కావ్య పూణేలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఇద్దరూ ఇంటి నుండి వర్క్ ఫ్రం హోంలో పని చేస్తున్నారు.
కావ్య ఇంట్లోకి సురేష్ రెడ్డి చొరబడ్డాడు. ఆమె చెల్లెలు అడ్డుగా రావడంతో ఆమెను పక్కకు తోసి తన వద్ద నున్న రివాల్వార్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కావ్య మొదటి రౌండ్ కాల్పుల నుంచి తప్పించుకుంది, కానీ రెండవ బుల్లెట్ ఆమె తలలోంచి దూసుకుపోయింది. ఇరుగుపొరుగు వారు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
కావ్య ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత సురేష్‌రెడ్డి అదే రివాల్వర్‌తో తలపై కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది వన్ సైడ్ లవ్ అని.. ఫోన్‌లు, మెసేజ్‌లు పంపుతూ సురేష్‌రెడ్డి ఆమెను వేధించేవాడని పోలీసులు తెలిపారు.
గత నెలలో సురేశ్‌రెడ్డి పెళ్లి ప్రస్తావనతో ఆమె తల్లిదండ్రులను సంప్రదించాడు. కావ్య ఇంటికి తన తల్లిదండ్రులను పంపించి అడిగించాడు.. అయితే అతడితో పెళ్లి ఇష్టం లేకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
ఇది సురేష్ రెడ్డికి కోపం తెప్పించిందని, చివరికి ఆమె హత్యకు.. తన ఆత్మహత్యకు దారితీసిందని కావ్య బంధువులు తెలిపారు.
సురేష్‌రెడ్డి వద్ద ఉన్న ఆయుధాన్ని, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తుపాకీపై ‘మేడ్ ఇన్ ది యూఎస్‌ఏ’ అని రాసి ఉంది.. ఆ ఆయుధాన్ని అతడు ఎక్కడి నుంచి సంపాదించాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
ఇద్దరూ బెంగళూరులో గతంలో పనిచేశారు. వీరిద్దరిదీ ఒకటే గ్రామం. ఈ క్రమంలోనే సురేష్ రెడ్డి బెంగళూరులో కావ్యను పిచ్చిగా ప్రేమించాడు. మొదట ఒప్పుకున్న కావ్య.. అనంతరం అతడి ప్రవర్తన కారణంగా ఇతడి ప్రేమను అంగీకరించలేక ‘పుణె’కు బదిలీ అయ్యి వెళ్లిపోయింది. ఇప్పుడు వర్క్ ఫ్రం పేరిట కావ్య, సురేష్ రెడ్డి ఇంట్లోనే పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానన్న కావ్య రిజెక్ట్ చేయడంతో అవమానం భరించలేక ఈ ఘాతుకానికి సురేష్ పాల్పడ్డారు. ఈ వన్ సైడ్ ప్రేమ కథ చివరకు విషాదాంతంతో ముగిసింది.
-సురేష్ తో పెళ్లికి కావ్య ఎందుకు ఒప్పుకోలేదు..
సురేష్ ను కావ్య పెళ్లి చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటన్నది వారి బంధువుల ద్వారా బయటపడింది. సురేష్ వయసు 35 సంవత్సరాలు కాగా.. కావ్య వయసు కేవలం 22 ఏళ్లే. అందుకే ఈ భారీ వయసు తేడా వల్లనే పెళ్లికి అంగీకరించలేదని తెలిసింది. కావ్యకు ఇష్టమైతే పెళ్లికి అభ్యంతరం లేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కానీ సురేష్ వయసు ఎక్కువ కావడం.. పైగా ప్రవర్తన సరిగా లేకపోవడంతోనే కావ్య అతడి పెళ్లి ప్రపోజల్ ను తిరస్కరించినట్టు బంధువులు తెలిపారు. అదే పగగా మారి ఆమెను చంపి అతడు చనిపోవడానికి దారితీసిందని చెబుతున్నారు.
Also Read: AP Debt Burden: ఏపీ ప్రభుత్వ అప్పులపై క్లారిటీ.. కేంద్రం కన్నెర్ర
Recommended Videos: