Homeఆంధ్రప్రదేశ్‌Southern states : ఏకమైన దక్షిణాది రాష్ట్రాలు.. ఏకీభవించిన చంద్రబాబు.. వైసిపి తటస్థం!

Southern states : ఏకమైన దక్షిణాది రాష్ట్రాలు.. ఏకీభవించిన చంద్రబాబు.. వైసిపి తటస్థం!

Southern states : కేంద్ర ప్రభుత్వ ( central government)నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి జనాభాను ప్రాతిపదికగా తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలో జనాభా తక్కువ. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరిగి రాజకీయ పెత్తనం పెరిగిపోతుంది. తద్వారా మరోసారి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నది ఇక్కడి ప్రభుత్వాల వాదన. కేంద్రం తాజా నిర్ణయంతో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్.. తదితర రాష్ట్రాలు రాజకీయంగా ఎంతగానో లబ్ధి పొందుతాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.

Also Read: డి లిమిటేషన్ తో ఏపీలో పెరిగే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా?

* జనగణనతో జాప్యం..
వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన( bifi creation ) ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ జన గణన నిలిచిపోవడంతో పునర్విభజన ఆలస్యం అయింది. 2026లో పునర్విభజన తప్పకుండా ఉండనుంది. అయితే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు తప్పవు. అందుకే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డిఎంకె అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలను అప్రమత్తం చేస్తున్నారు. దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది.

* పెరుగుదల అంతంతే..
లోక్ సభలో( Loksabha) మొత్తం సీట్ల సంఖ్య 543. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 129 సీట్లు. అంటే జాతీయస్థాయిలో 24% అన్నమాట. తెలంగాణలో 17, ఏపీలో 25, కేరళలో 20, తమిళనాడులో 39, కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొత్తం లోక్సభ సీట్ల సంఖ్య 753 పెరిగే అవకాశం ఉందని అంచనా. దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్న 24% నుంచి 19 శాతానికి పడిపోతుంది అన్నది తెలుస్తోంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు స్వల్పమే. తెలంగాణలో 20, ఏపీలో 28, తమిళనాడులో 41, కర్ణాటకలో 36 వరకు సీట్లు మాత్రమే పెరుగుతాయి. కేరళలో అయితే లోక్సభ స్థానాలు 20 నుంచి 19 కి పడిపోయే అవకాశం కనిపిస్తోంది.

* స్టాలిన్ నేతృత్వంలో ఉద్యమం..
అయితే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్( Tamila Nadu CM Stalin ). దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమ కార్యాచరణకు సిద్ధపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. పారదర్శకంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది ప్రధాన డిమాండ్. ఏపీకి సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. అదే సమయంలో స్టాలిన్ నిర్వహిస్తున్న భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ హాజరయ్యారు. అదే సమయంలో బిఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం వచ్చారు. వారితోపాటు కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంతు మాన్, ఒడిస్సా నుండి బి జెడి ప్రతినిధులు హాజరుకానున్నారు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరవుతారు.

* పొడిగా స్పందించిన చంద్రబాబు..
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో( South States) టిడిపి, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తటస్థ పాత్ర పోషిస్తుంది. దీంతో ఏపీ నుంచి ప్రధాన పార్టీల ప్రాతినిధ్యం ఉండడం డౌటే. అయితే దీనిపై చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చారు. డి లిమిటేషన్ బిల్లు ఇంకా రూపుదిద్దుకోలేదని మాత్రమే మాట్లాడారు. జనాభా పెరుగుదలకు డీలిమిటేషన్కు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అయితే పునర్విభజనతో బీహార్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళన పరిష్కరించేందుకు కేంద్రం ఏదో ఒక మార్గం చూపుతోందని ఆశ భావం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Also Read :అరుదైన ఛాన్స్ మిస్.. భయపడుతున్న జగన్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular