Garikapati Narasimha Rao : ప్రముఖ పంచాగకర్త, ప్రవచనకర్తగా గరికపాటి నర్సింహారావు తెలుగు ప్రజలకు సుపరిచితుడు. టీవీ ఛానెళ్లలో భక్తి కార్యాక్రమాలతోపాటు ఆలయాలు, భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సోషల్ మీడియాలో ఆయన ప్రవచనాలకు మంచి ఆదరణ ఉంది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, కొందరు సోషల్ మీడియా వ్యక్తులు ఇప్పుడు ఆయనను టార్గెట్ చేశాయి. వేర్వేరు ఘటనల్లో ఆయన ఎవరికో క్షమాపణలు చెప్పినట్లు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా కథనాలు ప్రసారం, వైరల్ చేస్తున్నాయి. పారితోషికాలు, ఆస్తుల విషయంలోనూ కొన్ని విషయాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో గరికపాటి టీం అలర్ట్ అయింది. తప్పుడు వార్తలను ఖండించింది. తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులపై పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరించింది. సోషల్ మీడియా దుష్ఫ్రచారంతో గరికపాటితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో చిరంజీవి విషయంలో..
ఇదిలా ఉంటే.. గతంలో గరికపాటి ఓ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడికి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. గరికపాటి ప్రవచనాలు సాగుతుండగా చిరంజీవి రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. దీంతో గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవిపైనే విమర్శలు చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో గరికపాటిని ట్రోల్ చేశారు. ఇక అదే వేదికపై చిరంజీవి కూడా గరికపాటికి కౌంటర్ ఇచ్చారు.
అల్లు అర్జున్‌పైనా..
తర్వాత పుష్ఫ సినిమా సమయంలో కూడా గరికపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జుర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా 2021లో విడుదలైంది. ఆ టైంలో ఇలాంటి సినిమాలు సమాజానికి హానికరం అని గరికపాటి వ్యాఖ్యనించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో చాలా మంది గరికపాటిపై విమర్శలు చేశారు.