Homeఆంధ్రప్రదేశ్‌Mahanadu sensational announcement: మహానాడు వేదికగా సంచలన ప్రకటన

Mahanadu sensational announcement: మహానాడు వేదికగా సంచలన ప్రకటన

Mahanadu sensational announcement: తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహానాడు వేదికగా ఒకసారి కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించే వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. మూడింట రెండు వంతు మెజారిటీ లేక వీగిపోయింది ఈ బిల్లు. అయితే ఈ బిల్లు ఇప్పుడు మరోసారి పార్లమెంట్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఈ మహిళా బిల్లు పై గట్టిగానే మాట్లాడుతున్నారు. జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ తరుణంలో మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ. బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33 శాతం మహిళలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది తెలుగుదేశం.

తొలిరోజు సక్సెస్
హైబ్రిడ్ మహానాడు ఈరోజు ప్రారంభం అయ్యింది. రెండు రోజులపాటు కొనసాగనుంది. పూర్తిగా డిజిటల్ విధానంలో.. ఆఫ్ లైన్, ఆన్లైన్ మోడ్ కలగలిపి టిడిపి చేపట్టిన ఈ మహానాడు తొలి రోజు సక్సెస్ అయ్యింది. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. నారా లోకేష్ అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై. సెటైరికల్ పంచ్ లతో పాటు లోకేష్ చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. నేరుగా పార్టీ శ్రేణులతో మమేకం అయ్యేందుకు లోకేష్ చేసిన ప్రయత్నం హైలైట్ గా నిలిచింది.

మహిళలకు సంబంధించి కీలక ప్రకటన..
స్త్రీ శక్తి ధీమ్ తో సాగిన మహానాడు లో అదే మహిళలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు నారా లోకేష్. పార్లమెంటులో బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అంటే వచ్చే ఎన్నికల్లో దాదాపు 50 మంది మహిళా ఎమ్మెల్యేలు సభకు రానున్నారు అన్నమాట. ఇప్పటికే నాయకులు తమ మహిళా వారసులను రంగంలోకి దించారు. పార్టీతో పాటు పాలనలో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు మహానాడు వేదికగా యువరాజు లోకేష్ ప్రకటనతో సీనియర్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహానాడు వేదికపై పెద్ద చర్చ నడిచింది. అయితే చాలామంది నేతలు కుమార్తెలు లేకపోవడంతో కోడళ్లను రంగంలోకి దించేందుకు అక్కడి నుంచే ప్రణాళిక మొదలుపెట్టారు. మొత్తానికైతే మహానాడు వేదికగా తొలి రోజు ఒక సంచలన నిర్ణయం వెలువడటం నిజంగా గొప్ప విషయమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular