Sankranti Cockfighting : తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఓవైపు పిండి వంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పూజలు, భోగి మంటలు జరుపుకున్నారు. మరోవైపు కోడి పందాలు, గుండాటలతోపాటు అనేక క్రీడా పోటీలు కొనసాగాయి. కోడి పందాలు జరిగిన ప్రాంతాలు మినీ స్టేడియం నే తలపించాయి. ఎటు చూసినా టెంట్లు, కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్లు, గ్యాలరీలు, కామెంట్రీ లు… ఇలా ఒకటేమిటి అన్ని చిత్ర విచిత్రాలు కొనసాగాయి.
* భారీగా బరులు
ముఖ్యంగా ఉభయగోదావరి( Godavari districts ) జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కోడి పందాలు కొనసాగాయి. భారీగా బరులు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు రెండు వేల కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ కొనసాగినట్లు ప్రచారం నడుస్తోంది. కోనసీమ నుంచి మొదలుపెడితే రాయలసీమ వరకు పంద్యాలు కొనసాగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తొలి రోజు అయిన భోగినాడు 350 కోట్ల రూపాయల సాగగా… ఆ తరువాత సంక్రాంతి రోజున ఏకంగా 600 కోట్ల రూపాయల బెట్టింగ్ సాగినట్లు తెలుస్తోంది. కనుమ రోజు ఒక్క రోజే వెయ్యికోట్ల పందాలు జరిగినట్లు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కోడిపందమే రికార్డు స్థాయిలో కోటి 25 లక్షలు పలికినట్లు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం బైబోయిన వెంకటరామయ్య తోటలో భారీగా బెట్టింగ్ సాగినట్లు తెలుస్తోంది. ఏపీలోనే ఇది హైలెట్ అన్నట్లు సమాచారం.
* ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
ఉమ్మడి తూర్పుగోదావరి( East Godavari ) జిల్లాలోని కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 500 కోట్ల రూపాయల మేర బెట్టింగ్ సాగినట్లు ప్రచారం నడుస్తోంది. కోడిపందాలతో సమానంగా గుండాట కూడా నడిచింది. ప్రధానంగా కాకినాడ జిల్లాలో మూడు రోజుల్లో 250 కోట్లకు పైగా పందాలు జరిగినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో 150 కోట్లు, కోనసీమ జిల్లాలో 100 కోట్లు సాగగా.. గుండాట రూపంలో మరో 50 కోట్ల రూపాయలు బెట్టింగులు సాగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది.
* కాకినాడ జిల్లాలో
కాకినాడ జిల్లాలో( Kakinada district) గుండాట వ్యాపారులకు కాసులు పంట పండించినట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామంలో రెండు నుంచి నాలుగు గుండాట బోర్డులను ఏర్పాటు చేశారట. అక్కడ లక్షల్లో లావాదేవీలు జరిగాయట. ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో సంక్రాంతి మూడు రోజులు కలిపి ఓ గుండాట నిర్వాహకుడు ఏకంగా కోటి 20 లక్షల బిజినెస్ సాగించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ వ్యాపారి అయితే 25 లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. మురమళ్ళ, కరప లో సైతం భారీగా గుండాట సాగినట్లు సమాచారం.
* ఉమ్మడి కృష్ణాజిల్లాలో
ఉమ్మడి కృష్ణాజిల్లాలో( Krishna district) కోడిపందాలు, పేకాట శిబిరాలు భారీగా నడిచినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు అయిన జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్ వరకు బరులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగిన కోడిపందాలలో 400 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్కో పందెం లక్ష నుంచి 7 లక్షల వరకు సాగినట్లు తెలుస్తోంది. వీఐపీ వరుణ్ లో అయితే మూడు నుంచి ఐదు లక్షలకు పైగానే పందాలు కాసినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి అయితే కోడిపందాల రూపంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరగడం విశేషం.