Kodi Pandalu: సంక్రాంతి( Pongal) అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు( Godavari districts ). ఉమ్మడి ఏపీలోనైనా.. నవ్యాంధ్రప్రదేశ్ లోనైనా ఈ విషయంలో గోదావరి జిల్లాలకు ఎవరు తీసి రారు. అంతలా ఉంటాయి అక్కడ సంక్రాంతి సంబరాలు. అన్నింటికీ మించి కోడిపందాలు. ఈ పందాలు కాయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వస్తుంటారు. దీని ద్వారా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుందని ప్రచారం కూడా ఉంది. ఒకప్పుడు వినోదంతో పాటు సరదాగా మొదలైన ఈ పందెం.. ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం అంతట సంక్రాంతి శోభ కనిపిస్తోంది. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో కోడిపందాల నిర్వహణకు సంబంధించి బరులు సిద్ధమయ్యాయి. ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ప్రధాన బరికి అనుబంధంగా చిన్నవి కొనసాగుతాయి.
* 30 ఎకరాల లేఅవుట్లో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ( Dr BR Ambedkar Kona Sima) జిల్లా పోలవరం మండలం మరమల్లలు దాదాపు 30 ఎకరాల లేఅవుట్లో భారీ భరినీ ఏర్పాటు చేశారు. కాగా ఇక్కడ ఎంపిక చేసిన వారికే ఎంట్రీ ఉంటుంది. బరి ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు చెందిన ఓ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎందుకు దాదాపు కోటి రూపాయల వరకు వెచ్చించినట్లు అంచనా ఉంది. గుండాట నిర్వహించేందుకు 75 లక్షలకు వేలం దక్కించుకున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ బరులు పక్కనే అన్ని ఏర్పాట్లు చేస్తారు. మద్యం అందుబాటులో ఉంటుంది. ఫ్లడ్లైట్ల వెలుగులో రేయింబవళ్లు కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* ఫుల్ టెక్నాలజీ
అయితే ఈ కోడిపందాల (chiken bets )బరుల వద్ద అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నట్లు సమాచారం. నిత్యం డ్రోన్లు తిరుగుతుంటాయి. అత్యాధునిక కెమెరాలతో వీడియో, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, అతిధులకు సరికొత్త రుచులు అందించేలా వంటకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి.
* ఎక్కడికక్కడే బరులు అమలాపురం( Amalapuram) పరిధిలోని ఎస్ యానం తీరంలో సంక్రాంతి సంబరాల పేరిట నాలుగు ఎకరాల భూమిని చదును చేశారు. ఇక్కడ మూడు రోజులపాటు కోడి పందాలు నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది. ఆత్రేయపురంలో పది చోట్ల బరులు సిద్ధం చేశారు. కాకినాడ రూరల్ పరిధిలోని నేమాం, సూర్యారావుపేటలో పెద్ద బరులు రూపొందించినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లిలో బరులు సిద్ధమయ్యాయి. అయితే ఈ కోడిపందాలతో కొన్నిచోట్ల రాజకీయ విభేదాలు బయటపడుతున్నాయి.