Samsung Company: తమిళనాడులో పోరు.. ఆంధ్రప్రదేశ్ కు లాభం.. స్టాలిన్ ప్రభుత్వం.. బంగారు పళ్లెంలో పెట్టి చంద్రబాబుకు అప్పగించేస్తోంది కదా?!

పోరు నష్టం.. పొందు లాభం.. ఈ నానుడిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుపెట్టారు. చేసి చూపించారు. రేపో మాపో తమిళనాడు నుంచి.. తన రాష్ట్రానికి తరలించకపోతున్నారు. ఇంతకీ ఆయన ఏం తరలించకపోతున్నారు? దీని వెనక ఏం కథ నడిచింది? ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

Written By: Anabothula Bhaskar, Updated On : October 11, 2024 11:53 am

Samsung Company(1)

Follow us on

Samsung Company: తమిళనాడులో శ్రీ పెరంబదూర్ లో సాంసంగ్ కంపెనీకి అతిపెద్ద ప్లాంట్ ఉంది. ఇక్కడ మేకిన్ ఇండియా విధానంలో సెల్ ఫోన్ లు తయారవుతున్నాయి. కొద్దిరోజులుగా ఈ కర్మగారంలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో సాంసంగ్ కంపెనీ తన ప్లాంట్ ఏపీలోని తిరుపతి పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీ సిటీకి తరలించేందుకు ఏర్పాటు చేస్తోంది.. శ్రీ సిటీ చెన్నై, ఎన్నూరు, కట్టుపల్లి, కృష్ణపట్నం, దుర్గరాజు పట్నం.. వంటి పోర్టులకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకవేళ సాంసంగ్ శ్రీ సిటీలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇక్కడ తయారైన ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి వీలుగా ఉంటుందని తెలుస్తోంది. పెరంబదూరు ప్లాంట్ లో కొంతకాలంగా కార్మికులు నిరసన బాట పట్టారు.. సెప్టెంబర్ 9 నుంచి మొదలు పెడితే 31 వ తేదీ వరకు సమ్మె కొనసాగింది. అయితే ప్లాంట్ మార్పుపై ఇటీవల సాంసంగ్ ప్రతినిధులు శ్రీ సిటీ అధికారులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే ప్లాంట్ మార్పుపై ఔను లేదా కాదు అనే విషయాలపై సాంసంగ్ ప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ.. ప్లాంట్ మార్పు తధ్యమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

5000 ఇస్తామని చెప్పినప్పటికీ..

సమ్మె చేస్తున్న నేపథ్యంలో సాంసంగ్ ప్రతినిధులు కార్మికుల కోసం ఐదువేల ప్రత్యేక భత్యం ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ విషయంలో సిఐటియు వెనక్కి తగ్గలేదు. కార్మికులకు తాము డిమాండ్ చేసినంత మొత్తంలో ఇవ్వాలని కోరింది. దానికి సాంసంగ్ ఒప్పుకోలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా, ఎంఎస్ఎం ఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) మంత్రి అన్బరసన్, కార్మిక శాఖ మంత్రి సి.వి గణేషన్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు మొదలుపెట్టారు.. ఈ క్రమంలో కార్మికులకు ఇస్తున్న 5000 ప్రత్యేక భత్యానికి వారు ఒప్పుకున్నారు. అయితే ఈ చర్చల్లో సిఐటియు భాగస్వామ్యం కాలేదు. మరోవైపు కార్మికులు తిరిగి పనిలోకి రావాలని ఫిక్కి తమిళనాడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ జీఎస్కే వేలు పేర్కొన్నారు.. మరోవైపు సిఐఐ తమిళనాడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీవత్స్ రామ్ కార్మికులు సమ్మె విరమించాలని కోరారు..

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో..

చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో శ్రీ సిటీలో పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగాయి. ఇటీవల ఈ పారిశ్రామిక నగరంలో 3,700 కోట్ల పెట్టుబడులపై వివిధ కంపెనీలతో ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే పెరంబదూరు ప్లాంట్ లో కార్మికులు తరచూ నిరసనకు దిగుతున్న నేపథ్యంలో.. సాంసంగ్ ప్లాంట్ ను ఆంధ్రకు మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఒక దఫా చర్చలు పూర్తయినట్టు.. త్వరలోనే మరోసారి శ్రీ సిటీ అధికారులతో సాంసంగ్ అధికారులు భేటీ కాబోతున్నారని సమాచారం. స్థూలంగా చూస్తే తమిళనాడు ప్రభుత్వం కార్మికుల సమ్మెకు మద్దతు పలకడం.. ఇన్ని రోజులపాటు ప్లాంట్ లో ఉత్పత్తి తగ్గిపోయినప్పటికీ స్పందించకపోవడంతో.. సాంసంగ్ ప్రతినిధులు శ్రీ సిటీకి తమ ప్లాంట్ తరలించేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గనుక ఈ ప్లాంట్ శ్రీ సిటీలో ఏర్పాటయితే వేలాది మందికి ఉపాధితో పాటు.. ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం వస్తుందని తెలుస్తోంది.