CM Jagan vs BJP : అందరిలా జగన్ ఊరుకోడు అని అర్థమైంది… తనను పగబట్టిన వారిని వెంటాడుతాడు అనడానికి ఇదే ఉదాహరణ.. నిన్నటివరకూ బీజేపీ నేతలు దోస్తులు.. కేంద్రంతో జగన్ సాన్నిహిత్యంగా మెలిగారు. బీజేపీకి మెజార్టీలేని రాజ్యసభలో వైసీపీ ఎంపీలతో మద్దతునిచ్చారు. లోక్ సభలో బిల్లులకు ఆమోదం తెలిపి బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచాడు.
కానీ కాలం మారింది. ఎన్నికలు వచ్చాయి. బీజేపీ రాజకీయ అవసరాలు పెరిగాయి. అందుకే బీజేపీ పెద్దలు ఏపీలో వాలిపోయారు. ఇక్కడి చంద్రబాబు ఢిల్లీలో గద్దలా దిగారు. బీజేపీ పెద్దలను కలిసి పొత్తు పెట్టుకుంటానని.. కరుణించాలని కాళ్లా వేళ్లా పడ్డారు. 20 ఎంపీ సీట్లు ఇస్తే పొత్తుకు రెడీ అని అమిత్ షా కండీషన్ పెట్టాడు. దానికి ఓకే చెప్పిన చంద్రబాబు బీజేపీని ఏపీకి ఆహ్వానించారు. జగన్ ను తిట్టించడం మొదలుపెట్టారు.
కానీ దోస్తీకి దోస్తీ.. శత్రుత్వానికి శత్రుత్వం అని తెలిసిన జగన్ వదలలేదు. అంతటి సోనియాగాంధీని, కాంగ్రెస్ ను ఎదురించిన జగన్ కు ఈ బీజేపీ ఒక లెక్కకాదు. పైగా అసలు ఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు. జగన్ ను అడిగితే ఇంకొన్ని ఎంపీ సీట్ల మద్దతు ఇచ్చేవాడు. కానీ గెలవని టీడీపీ పంచన చేరి జగన్ ను తిట్టిన అమిత్ షాను, జేపీ నడ్డాను జగన్ వదలలేదు. తొలిసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
అమిత్ షా, జేపీ నడ్డాలు జగన్ పై విరుచుకుపడడం ప్రారంభించారు. ఎంతయినా ఢిల్లీ పీఠాన్ని ఎదురించిన చరిత్ర ఉన్న జగన్ ఫస్ట్ టైమ్ బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చాడు. తనకు బీజేపీ అండ ఏమాత్రం లేదంటూ జగన్ జనం ముందే చెప్పుకున్నారు. తాను ఎల్లో మీడియా విష ప్రచారం మీద.. అలాగే అవినీతి అక్రమాల మీద పోరాడుతున్నానని చెప్పారు. ఈ పోరాటంలో తనకు ఎల్లో మీడియా ఎదురు నిలిచిందని.. టీడీపీ కూడా తనకు పూర్తిగా ప్రత్యర్ధులుగా మారారన్నారు. ఇపుడు వారితో పాటు బీజేపీ కూడా అండ తనకు లేదని జగన్ స్పష్టం చేశారు. తాను పూర్తిగా దేవుడిని జనాలను నమ్ముకున్నానని జగన్ తేల్చేశారు. తనకు జనం ఆశీస్సులు.. దేవుడి దీవెనలు ఉంటే చాలని జగన్ పేర్కొన్నారు. మొత్తానికి జగన్ నోటి వెంట బీజేపీ అండ లేదు అన్న మాట చెప్పి మీతో అసలు నాకు ఏం కాదని.. బీజేపీ ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అని సంకేతాలు పంపారు. ఏపీలో నన్ను ఎవరూ ఏం చేయలేరన్న ధీమాను వ్యక్తం చేశారు.
బీజేపీపై జగన్ తొలి కౌంటర్ చూశాక అందరూ ‘జగన్.. మగాడ్ర బుజ్జీ’ అంటూ సోషల్ మీడియాలో సినిమా డైలాగ్ ను వల్లెవేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
టీడీపీ+ జనసేన+ బీజేపీ+ కాంగ్రెస్+ సీపీఎం+ సీపీఐ Vs వైఎస్ఆర్ సీపీ pic.twitter.com/WNfNq7EK6i
— Political Punch (@PoliticalPunch9) June 12, 2023